ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం ఐదో బ్లాక్‌‌లో ఆయన ఛాంబర్‌లోకి అడుగు పెట్టారు. బాధ్యతలు తీసుకున్న వేంటనే రంగంలోకి దిగిన లోకేష్ గ్రామాలు, తండాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.  అంతే కాదు తొలి రోజు మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఐటీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖలు ఆయనకు కేటాయించిన సంగతి తెలిసిందే.

ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తాను మంత్రిని కాకమునుపే ప్రయత్నించానని, కానీ అప్పట్లో తన ప్రయత్నాలను వైసీపీ అడ్డుకుందని ఐటీ, పంచాయితీ రాజ్ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఇప్పుడిక మంత్రి హోదాలో అధికారికంగా పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. పని విషయంలో తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే తనకు పోటీ అని, ఐటీ పరిశ్రమతో తనకు ఉన్న పరిచయాలతో ఏపీకి పెట్టుబడులను ఆకర్షిస్తానని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Image result for నారా లోకేష్
ఈ సందర్భంగా..ఏడాదిలో 50రోజులు ఉపాధి హామీ పని చేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించే ఫైల్‌పై తొలి సంతకం చేశారు. దీని ద్వారా 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పంచాయత్‌ రాజ్‌ ద్వారా గ్రామాల్లో...సాలీడ్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ ఫైల్‌పై రెండో సంతకం, గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు ద్వారా దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిపేందుకు రూపొందించిన ప్రణాళికపై మూడో సంతకం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: