Image result for indo-pak water treaty


Related image



భారత సర్వోన్నత న్యాయస్థానం నేడు భారత్ పాక్ జల ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యా న్ని నిష్కర్షగా నిర్ద్వందంగా విచారణకు అర్హత లేదని తిరస్కరించింది. ఈ అర్జీని ఏం.ఎల్. శర్మ అనే డిల్లి లో నివసించే లాయర్ ఈ ఒప్పందం చట్టవిరుద్ధమని వాదించారు. 



Image result for jawaharlal nehru ayub khan signed indo-pak water treaty



సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ ఖేహార్ ఈ కేసులో విషయం లేదు కనుక మేము కలగ చేసుకోలేమని తెలిపారు. అలాగే ఈ కేసులో తగిన పత్రాలతో కూడిన సరైన, తగిన ఆధారాలు సమర్పించలేదని సుప్రీం కోర్ట్ తన స్టాండ్ ను తెలిపింది. 



Image result for indo-pak water treaty



ఈ ఒప్పందం పై సెప్టెంబర్ 19, 1960 నాడు నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహౄ, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భారత రాష్ట్రపతి సంతకం చేయవలసి ఉండగా ప్రధాని జవహర్ లాల్ నెహౄ మరియు ఖాన్  సంతకం చేయటం చట్ట విరుద్ధమని లాయర్ శర్మ వాదించారు. 



Image result for indo-pak water treaty




ఈ ఒప్పందం లో ఆరు నదీ ప్రవాహాలు కవరై ఉన్నాయని - మూడు ఉత్తర ప్రాంత నదులైన రావి, బీయాస్, సట్లెజ్ తో పాటు వాటి ఉపనదుల తో పాటు దక్షిణ ప్రాంత నదులైన ఇండస్, జీలం, చినాబ్ నదులతో పాటు వాటి ఉపనదులూ ఉన్నాయి. ఉత్తర ప్రాంత నదులు వాటి జలాలు భారత్ కు ప్రత్యేకించినట్లు దక్షిణ ప్రాంత నదులు, వాటి నదీ ప్రవాహాలలో 80% ప్రవాహ జలాలను భారత్ పాకిస్థాన్ కు ఉదారంగా కేటాయించింది. ఫలితంగా భారత్ కన్నా పాకిస్థాన్ నాలుగు రెట్లు అధికంగా నదీ తీర జలాలను అనుభవిస్తుంది.
 
          

Image result for indo-pak water treaty

మరింత సమాచారం తెలుసుకోండి: