2009 ఎలక్షన్ కి పూర్వం ఎన్టీఆర్ పేరు ఎక్కడా రాజకీయాలలో వినపడలేదు. ఒక పక్క అద్భుత ఫార్మ్ లో ఉన్న వై ఎస్సార్ , కొత్తగా దిగిన చిరంజీవి - అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ లాంటి వారు బరిలో స్ట్రాంగ్ గా ఉన్న టైంలో చంద్రబాబు ఎన్టీఆర్ లాంటి స్ట్రాంగ్ పర్సన్ ని తెచ్చుకుని ప్రజాకర్షణ మంరం జపించారు. చెబుతున్న విషయం లో స్పష్టత, జనం లో గాంభీర్యం  మైంటైన్ చెయ్యడం లో ఎన్టీఆర్ సైతం పాజిటివ్ గానే ప్రవర్తించాడు.


చంద్రబాబు కి ఈ రేంజ్ లో ప్రజలకి మీటింగ్ లతో ఆకర్షించే సీన్ లేకపోవడమే టీడీపీ కి నెగెటివ్ కాగా ఆ టైం లో ఎన్టీఆర్ కి బెనిఫిట్ అయ్యింది. మాట్లాడే శక్తి విషయం లో అప్పట్లో చిరు - పవన్ లని సైతం ఎన్టీఆర్ డామినేట్ చేసి పారేసాడు.తెలుగు దేశాన్ని స్థాపించిన ఎన్టీఆర్ శైలిలోనే ఖాకీ చొక్కా వేసుకుని రంగంలోకి దిగిన తారక్ అదరగొట్టాడు. మామూలుగా అయితే సినిమా వాళ్ళందరూ కూడా మేకప్ లేకుండా కనిపించడానికి పెద్దగా ఇష్టపడరు.


తన ప్రసంగాలతో తన తాతని గుర్తు చెయ్యడం లో సక్సెస్ అయ్యాడు ఎన్టీఆర్. యాక్సిడెంట్ అయితే బెడ్ మీద పడుకుని సైతం స్పీచ్ లు ఇచ్చిన ఎన్టీఆర్ జనాలకి గుర్తు ఉండిపోయేలా కష్టపడ్డాడు. ఆ తరవాత టీడీపీ ఫెయిల్ అవ్వడం ఎన్టీఆర్ ని నెమ్మదిగా సైడ్ చెయ్యడం పోయిన ఎన్నికల టైం కి ఎన్టీఆర్ బదులు పవన్ ని చంద్రబాబు రంగంలోకి దింపి కాపు ఓట్లు సైతం తమకి పడేలా చేసుకోవడం మనకి తెలిసిందే. రాజకీయాల గురించి ఎన్టీఆర్ కి ఎలాంటి ఆలోచన ఉందొ ఎవ్వరికీ తెలీదు. ఎన్టీఆర్ ని టీడీపీ కి దూరం చెయ్యడం కోసం ఎన్నో శక్తులు కష్టపడుతున్నయి అని ఎప్పటి నుంచో టాక్ ఉండనే ఉంది.


ఈ మధ్య కాలం లో ఎన్టీఆర్ ఒక పార్టీ పెట్టాడు అంటూ న్యూస్ వినపడడం కొన్ని రోజుల తరవాత ఎదో పార్టీ పేరు మీద లెటర్ బయటకి రావడం , ఎన్టీఆర్ ని కొందరు ప్రత్యెక వ్యక్తులు కలిసారు అంటూ న్యూస్ వినపడడం లాంటివి పెద్ద నవస్ అయ్యి కూర్చున్నాయి. కనీసం కామన్ సెన్స్ లేకుండా మీడియా కూడా ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు అంటూ గొడవ చేస్తున్నారు. మినిమం అభిప్రాయం తీసుకోవడం అనేది మీడియా క్రెడిబిలిటీ అదంతా వదిలేసి ఎవరో ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తుంటే మీడియా దానికి వత్తాసు పలకడం కామెడీ గా ఉంది. రేపు ఇంకెవడో గోన గన్నయ్య నా పార్టీకి ఎన్టీఆరే అధ్యక్షుడు అంటే మళ్ళీ హంగామా మొదలెడతారా? ఎన్టీఆర్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీడియా సహాయం తో చంద్రబాబు చేస్తున్న ప్లాన్ ఇది అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: