తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అంత తేలికగా బాధ పడే వ్యక్తి కాదు .. ఆయన ఎప్పుడూ దృడ స్వభావం తో సాగుతూ తెలివిగా మసలుకునే లీడర్. తెలంగాణా ఉద్యమ సమయం నుంచీ తనతో ఉన్న తెలంగాణా రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు విద్యా సాగర రావు చనిపోగా మొట్ట మొదటి సారి కెసిఆర్ కంట్లో కన్నీళ్లు చూడాల్సి వచ్చింది. ఆయన మృతి కెసిఆర్ ని తీవ్రంగా కలచి వేసింది.  హబ్సిగూడలో ఉన్న విద్యాసాగర్ రావు నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్... పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు పార్థీవదేహాన్ని చూసి సీఎం కేసీఆర్ ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. మంచి మిత్రుడు పెద్దన్నలా వ్యవహరించిన వ్యక్తి నీటిపారుదల రంగంలో నిపుణుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప మేధావిని ఈ రాష్ట్రం కోల్పోయింది అన్న కెసిఆర్ నీళ్ళ నిధుల నియామకాల టైం లో విద్యాసాగర రావు తీవ్రంగా కృషి చేసారు అని ఆవేదన వ్యక్తం చేసారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: