బాహుబలి.. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా.. ఒక తెలుగు దర్శకుడు కలలో కూడా ఊహించని రేంజ్ లో రాజమౌళి బాహుబలి సినిమాను తెరకెక్కించాడు. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి ఓ బృహత్కథను తెలుగు తెరపై ఆవిష్కరింపజేశాడు రాజమౌళి. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ బాహుబలిని చూసి గర్వపడుతోంది. 

Image result for bahubali 2 images

అందుకే రాజమౌళి కష్టానికి తగిన ఫలాలు ఇప్పుడు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగానూ బాహుబలి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం మూడు రోజుల్లో 550 కోట్ల రూపాయలు కొల్లగొట్టిందంటే మాటలు కాదు. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ బరిలోనూ నిలవబోతోందా.. భారతీయ సినిమాకు తీరని కోరికలా మిగిలిన  ఆస్కార్ అవార్డులు సాధిస్తుందా.. 

Image result for bahubali 2 images

అలా ఆస్కార్ అవార్డులు సాధించేక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారా... అవును నిజమే.. బాహుబలి సినిమాకు ఆస్కార్ అవార్డు కు సిఫారస్ చేయాలని ఏపీ సర్కారు కేంద్రాన్ని కోరబోతోంది.  ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు మీడియాకు వెల్లడించారు. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి 
ప్రతిభను చాటిందని చంద్రబాబు అన్నారు. 

Image result for bahubali 2 rajamouli

బాహుబలి రూపకర్త, సినీ దర్శకుడు రాజమౌళికి హాట్సాప్ చెబుతున్నానన్న చంద్రబాబు....  చిత్ర నిర్మాణానికి పనిచేసిన యూనిట్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అభినందనలు తెలిపిందని వివరించారు. అంతే కాదు... బాహుబలి యూనిట్‌ను త్వరలో అమరావతికి తీసుకొచ్చి సన్మానిస్తామని కూడా చెప్పారు చంద్రబాబు. మరి ఇప్పటికైనా అమరావతి నిర్మాణం కోసం రాజమౌళి తన వంతు సాయం అందిస్తాడా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: