మన దేశంలో వ్యభిచారం నేరం.. వ్యభిచారం పేరిట  అమ్మాయి అక్రమ రవాణా నేరం.. అమ్మాయిలతో వ్యభిచరించే విటులదీ నేరమే. ఐతే.. అమ్మాయిలు తమంతట తాము ఇష్టపడి వ్యభిచారంలో దిగితే మాత్రం నేరం కాదట. ఓ కేసు విచారణలో గుజరాత్ హైకోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది.  


ఓ అమ్మాయి తనంతట తానుగా వ్యభిచారం చేస్తే క్రిమినల్ కేసులు పెట్టకూడదని గుజరాత్ హైకోర్టు చెప్పింది. సూరత్ లో ఇటీవల ఓ వ్యభిచార గృహంపై దాడి చేస్తే కొందరు విటులు దొరికారట. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. కానీ వారిలో వినోద్ పటేల్ అనే వ్యక్తి తనపై కేసు పెట్టడం అన్యాయమని.. తనది నేరం కాదని వాదించాడు. 



పోలీసులు అరెస్టు చేసే సమయానికి తాను వ్యభిచారం చేయలేదని.. తన వంతు కోసం ఎదురు చూస్తున్నానని వినోద్ పటేల్ వాదించాడు. ఈ కేసును కూలంకషంగా పరిశీలించిన న్యాయమూర్తి.. సదరు యువతి ఇష్టపడి సెక్స్ వర్కర్ గా మారితే.. ఆమె వద్దకు వచ్చిన విటులపై కేసు పెట్టరాదని తీర్పు చెప్పారు. ఇప్పుడు ఈ తీర్పు ఇప్పటివరకూ ఉన్న చట్టాలతో విబేధిస్తోందని కొందరు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: