ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో చాలా కఠిన నిబంధనలు తీసుకు వస్తున్నారు.  ఇక నుంచే ఆధార్‌ కార్డు ఉంటేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేయనున్నారు. ప్రస్తుతం లైసెన్సు జారీలో ఆధార్‌ కార్డును పొందుపరుస్తున్నప్పటికీ తప్పనిసరి అనే నిబందన లేదు. లైసెన్సు దారుడి సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుంది.  కేంద్ర ప్రభుత్వం అన్నింటికీ ఆధార్ తప్పనిసరి కాదని ఎన్నిసార్లు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.
Image result for driving licence
అన్ని పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్న ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్‌లపై కూడా దృష్టి సారించింది.  భవిష్యత్తులో దీనిని తప్పనిసరి చేస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకోనుందట. గతంలో తప్పనిసరి చేసి ఈ నిర్ణయాన్ని రద్దు చేసినా ప్రస్తుతం మళ్లీ దానినే అమలు చేయాలని భావిస్తుస్తోంది. డ్రైవింగ్ లైసెన్సు ఆధార్‌కార్డు తప్పనిసరి చేయడం వల్ల సంబంధిత లైసెన్సుదారుడి సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.  
Image result for driving licence
ఆధార్‌కార్డు జోడించడం వల్ల యాక్సిడెంట్స్‌తో పాటు కేసుల విచారణ సులభతరమై బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. దాదాపు బ్యాంకులు, ఇతర లావాదేవీలతోపాటు ప్రతి దానికి, ధ్రువ పత్రాలను జతపరుస్తుండటంతో డ్రైవింగ్ లైసెన్సుల జారీలో కూడా తప్పనిసరి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం త్వరలో అమల్లోకి రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: