ఇప్పుడు రాష్ట్రమే కాదు, జాతీయ స్థాయిలోను కాంగ్రేస్ ఏపి విభజన పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ఉత్కంఠగా ఎదురుచూస్థున్నారు. విభజన విషయంలో ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. రాష్ట్రంలో నైతే పార్టీల కతీతంగా ప్రాంతాల వారీగా విడిపోయి ఎవరి ప్రాంతం కోసం వారు తెగ ప్రయత్నాలు చేస్థున్నారు. అయితే రాష్ట్రానికి నేనే దిక్కు అని చెప్పుకోవడమే కాదు, ఏకంగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం అధినేత ఇదేమి పట్టనట్టుగా తలపై తడిగుడ్డవేసుకుని కూల్ గా ఉండడం అందరిని విస్మయానికి గురి చేస్థోంది.

రాష్ట్రం ఇప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఈ సమయంలో ప్రతి తెలగుపౌరుడు స్పందించాలి. ఎక్కడో ఉత్తరాఖండ్ లో తెలుగువారు కష్టాల్లో ఉంటేనే తల్లడిల్లి పోయిన చంద్రబాబేనా ఇప్పుడు తెలుగుతల్లే ఎప్పుడు ఎదుర్కోని విపత్కర పరిస్థితుల్లో ఉంటే అదేదో తెలియనట్టుగా ఉంటున్నారు అని విస్థుపోతున్నారు ఏపి జనం. అయితే  ఏమి జరగదనో, ఏది జరుగుతున్నా తెలుగువారికి ఏమి ముప్పులేదనో సంకేతాలున్నాయోమో కాని అది చెప్పకున్నా కనీసం ఏమి కాదని అంతా మంచి జరుగుతుందని, ఒక వేళ ఏదైనా చెడు జరిగితే అడ్డుకుంటాననో చంద్రబాబు చెప్పవచ్చుగదా... అది వదిలేసి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి నోట రాని ఏవోవో విషయాలు వల్లిస్థే, కొంపదీసి సీన్ రివర్స్ అవుద్దేమో బాబు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

తాజాగా చంద్రబాబు మీడియా ముందుకు వస్థే ఇప్పటి పరిణామాలపై ఏదో మంచి వార్థ చెబుతారని ఆశిస్థే ఆయన  మాత్రం ఆ విషయమే తెలియనట్టు, అంతా సాఫీగానే ఉన్నట్టు ముఖం పెట్టి దేశంలో, రాష్ట్రంలో దోచుకుని దాచుకునే వాళ్లే ఎక్కువయ్యారు అంటూ బాధ వెల్లగక్కారు. సంస్థలపై దాడులు చేయడం హేయకరమన్నారు, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్థున్నారంటూ ఆవేదన వ్యక్థం చేసారు. ఎన్నికలు ప్రలోభాలకు లొంగకుండా పకడ్భందీగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో అందరి దారి ఒకటయితే తన రూటు మాత్రం సెపరేటు అంటూ చెప్పేసి ఊరుకున్నారు. బాబు నిర్వాకం చూసి ఏపి కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: