24 గంటల ఛానళ్లలో అప్పుడప్పుడూ తప్పులు దొర్లడం సహజమే. కానీ కావాలని కొందరిని ఇబ్బందిపెట్టేలా కథనాలు ప్రసారం చేయడం మాత్రం కుట్రగానే భావించాలి. మన తెలుగు మీడియాలో అలాంటి కుట్రలు చాలా జరుగుతుంటాయి. తమకు అనుకూలమైన వారిని ఆకాశానికి ఎత్తేందుకు.. నచ్చని వారిని పాతాళానికి తొక్కేందుకు తెలుగు ఛానళ్లు ఏమాత్రం సంకోచించవు. 



తాజాగా.. ఓ వివాదం తెలంగాణ మంత్రి కేటీఆర్ కూ.. టీవీ9, ఎన్టీవీలకూ వచ్చింది. ఓ కేసు విషయమై తెలంగాణ పోలీసులు ఓ వ్యక్తిని చితకబాదారంటూ ఈ రెండు ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలను ప్రసారం చేశాయి. ఐతే.. అసలు విషయం ఏంటంటే.. ఆ దృశ్యాలు తెలంగాణలో జరిగినవి కానే కాదు. 



అవి రాజస్థాన్ లో ఓ పోలీస్ స్టేషన్ లో జరిగినవి.. ఈ అంశం ఎలాగో కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఇలా తప్పుడు ప్రసారాలు చేయడం దారుణం. కనీసం ఇప్పటికైనా ఆ రెండు ఛానళ్లు చేసిన పొరపాటును తమ ఛానళ్ల ద్వారానే ప్రజలకు చెప్పాలని సూచించారు. కేటీఆర్ స్వయంగా స్పందించేసరికి టీవీ9 తన వార్తకు సవరణ ప్రసారం చేసింది. 



ఆ వార్తలో దృశ్యాలు తప్పుగా ప్రసారమైన మాట వాస్తవమేనని తన టీవీలోనే అంగీకరించింది. ఈ మేరకు యాంకర్ తో ఓప్రకటన చేయించింది. ఇది ఎడిటింగ్ రూమ్ లోజరిగిన పొరపాటుగా చెప్పింది. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడతామని వివరణ ఇచ్చింది. టీవీ9 స్పందనను ప్రశంసించిన కేటీఆర్ ఆ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: