తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ వర్గీయుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దినకరన్ గురించి మంత్రి జయకుమార్ చేసిన వ్యాఖ్యలతో మాటల యుద్ధానికి తెరలేచింది. జయకుమార్ వ్యాఖ్యల పట్ల దినకరన్ వర్గీయులు ఘాటుగా స్పందించారు. పళని వర్గం నుంచి దినకరన్ గూటికి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు.


దీంతో, పళని ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో, పళనిస్వామి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే... మాటల యుద్ధానికి తెరదించాలని ఆయన భావిస్తున్నారు. దీంతో, దినకరన్ పై ఎవరూ విమర్శలు చేయరాదంటూ మంత్రులను ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: