ఉత్తర్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో వినూత్న పథకాలు తీసుకు వచ్చారు.  ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని తన ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని చెప్పారు.  గోవద నిషేదం..పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు తీసుకు వచ్చారు.  ప్రభుత్వ అధికారుల పనితీరుపై ఏ చిన్న కాంప్లెంట్ వచ్చినా వారి ని డిస్మిస్ చేస్తూ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.  తాజాగా యోగి ఆదిత్యనాథ్ పై ఓ గిరిజన మహిళ కేసు పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాంకు చెందిన బీజేపీ ఎంపీ రాంప్రసాద్ శర్మలపై ఓ గిరిజన మహిళపై ఫిర్యాదు చేశారు. తన నగ్న ఫొటోను వీళ్లిద్దరు సోషల్ మీడియాలో షేర్ చేసి, తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి  వెళ్తే పదేళ్ళ క్రితం (2007లో) గౌహతిలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో తనను వివస్త్రను చేసి కొందరు కొడుతున్న చిత్రాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం లోక్‌సభ ఎంపీ రాం ప్రసాద్‌ సర్మాలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ.. అస్సాంకు చెందిన గిరిజన మహిళ లక్ష్మీ ఒరాంగ్‌ కోర్టును ఆశ్రయించారు.

ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద బిస్వనాథ్‌లోని సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళా సాధికారత కోసం బేటీ పడావో, బేటీ బచావో అంటుండగా యూపీ సీఎం యోగి మాత్రం.. మహిళలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ఇదే ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు. ఆరోజు జరిగిన ర్యాలీ బీజేపీ పార్టీదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీని అడ్డుకొని దాడి చేశారని వ్యాఖ్యానించారు’ అని లక్ష్మి ఫిర్యాదులో వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: