ప్రకృతిలో మనుషులతో పాటు కొన్ని సాదు జంతువులు కూడా జీవిస్తుంటాయి.  కుక్క,పిల్లి,కుందేలు ఇలా కొన్ని జంతువులు మనుషులతో చేసే కాలక్షేపం ఎంతో సంతోషంగా ఉంటుంది.

ఇక కొన్ని జూ పార్క్ ల్లో జంతువులు చేసే విన్యాసాలు కడుపుబ్బా నవ్విస్తుంటాయి.  తాజాగా యూఎస్ లోని వాషింగ్ట‌న్ డీసీ లో ఉన్న స్మిత్ సోనియ‌న్ నేష‌న‌ల్ జూ లో  ఓ చిన్న పాండా చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు చూసి అక్కడి వీక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు.
Image result for panda fits
 దాని విన్యాసాలు ఓ ఔత్సాహికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.   చెట్టు పట్టుకొని కింద పడటం..కొమ్మపై నడవటం..ఇలా గమ్మత్తైన విన్యాసాలతో పాండా పలువురుని ఆకర్షించింది.  చేష్ట‌లు చూసి చిన్నా, పెద్దా అందరూ తెగ నవ్వుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: