బుట్టా రేణుక కర్నూలు ఎంపీ పేరొందిన పారిశ్రామికవేత్త కూడా.! పారిశ్రామికవేత్త కాబట్టే ఆమెకు ఎంపీ సీటిచ్చి గెలిపించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది వేరే విషయం. టైం కలిసిరావడంతో ఎంపీగా గెలవాలన్ని తన చిరకాల కోరికను తీర్చేసుకున్నారు బుట్టా రేణుక. అయితే తాను గెలుపొందిన పార్టీ మాత్రం అధికారంలోకి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. అంతే.. గెలిచి వెంటనే ఢిల్లీలో సీఎం చంద్రబాబును కలిసింది. ఆ సమయంలోనే నంద్యాల నుంచి వైసీపీ తరపున గెలిచిన ఎస్.పి.వై.రెడ్డి టీడీపీలో చేరిపోయారు. బుట్టా రేణుక మాత్రం తాను, తన భర్త చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశాం తప్ప పార్టీలో చేరలేదని క్లారిటీ ఇచ్చారు.

Image result for బుట్టా రేణుక కర్నూలు ఎంపీ

ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఆమె టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. అదే సమయంలో వైసీపీ కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చారు. దీంతో ఆమె ఎటువైపు ఉన్నారో తెలియక అటు పార్టీ శ్రేణులు, ఇటు నియోజకవర్గ ప్రజలు తలపట్టుకునేవారు. తాజాగా శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ ను ఎంపీ బుట్టా రేణుక కలిశారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే తాను లోకేశ్ ను కలిసినట్లు రేణుక క్లారిటీ ఇచ్చారు. ఇవాళ లోటస్ పాండ్ లో జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడా బుట్టా రేణుక గైర్హాజరయ్యారు. దీంతో ఆమె ఇక వైసీపీకి గుడ్ బై చెప్పినట్లేనని అంతా భావిస్తున్నారు.

Image result for బుట్టా రేణుక కర్నూలు ఎంపీ

వాస్తవానికి బుట్టా రేణుక కుటుంబానికి రాజకీయాలు పార్ట్ టైం. వ్యాపారం ఫుల్ టైం. ఇలాంటి నేతలు ఏ రాజకీయ పార్టీకి అంటకాగరు. తమ వ్యాపార ప్రయోజనాలే వీళ్లకు పరమావధి. తమ అవసరాలమేరకు ఏ పార్టీనైనా ముద్దాడగలరు. అవసరం లేదనుకున్నప్పుడు ఛీత్కరించుకోగలరు. ఇప్పుడు బుట్టా రేణుక కూడా అంతే.! వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా అధికార పార్టీలో ఉండడం ఆమెకు శ్రేయస్కరం. అందుకే గెలిచిన వెంటనే చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత కూడా టీడీపీతో సత్సంబంధాలు నెరుపుతూనే, వైసీపీలోనే ఉన్నాననిపించుకుంటోంది.

Image result for tdp

అయితే ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయమొచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. జగన్ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించారు. టీడీపీ కూడా రేపోమాపో కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నేతలు క్లారిటీకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. అన్నిటికీ మించి నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీని దెబ్బకొట్టాలని టీడీపీ తీవ్రంగా ట్రై చేస్తోంది. బుట్టా రేణుకను అధికారికంగా తమ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు రేణుకకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం.

Image result for ysrcp

అందుకు బుట్టా రేణుక కూడా సరేనన్నట్టు తెలుస్తోంది. అందుకే వైసీపీకి అధికారికంగా గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయి టీడీపీ నేతగా చెలామణీ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు బుట్టా రేణుక ఓ ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఆమె తాజా పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైర్హాజరైనట్లు ఆమె సన్నిహితవర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకూ నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీత వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో కలిశారు. ఇప్పుడు బుట్టా రేణుక కూడా ఆ జాబితాలో చేరేందుకు సిద్ధమయ్యారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: