ముస్లిం దేశాల్లో మహిళలకు కట్టుబాట్లు ఎక్కువనే విషయం తెలిసిందే. వారు ధరించే దుస్తుల దగ్గర్నుంచి చేసే పనుల వరకు అన్నింటికీ నిబంధనలుంటాయి. అలాంటి దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాలో ఓ యువతి స్కర్ట్ ధరించి కన్పించింది. ఆడవారు సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలని, డ్రైవింగ్ కూడా చేయకూడదని సౌదీలో ఎన్నో ఆంక్షలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఓ చారిత్రక ప్రదేశంలో మినీ స్కర్ట్ వేసుకొని వెంట్రుకలు కనిపించేలా తిరిగినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
సౌదీ అరేబియాలో ఈ ఘటన జరిగింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ శివారులోని చారిత్రక ఉషౌఖిర్లో ఆమె ఇలా చక్కర్లు కొట్టింది. అంతేగాక, ఆమె అలా తిరుగుతుండగా వీడియో కూడా తీసుకుంది. సంప్రదాయికమైన ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను ఆమె ఉల్లంఘించిందంటూ ప్రజలు ఆ యువతిపై మండిపడుతున్నారు. ఆమె కేసును దేశ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అప్పగించారని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది.
గతవారం ఆ యువతి స్నాప్‌చాట్‌లో పెట్టిన వీడియోను చాలామంది చూశారు. వెంట్రుకలను స్వేచ్ఛగా వదిలేసి.. మినీ స్కర్ట్, క్రాప్ టాప్ ధరించిన ఆమె ఓ చారిత్రక ప్రదేశాన్ని వీక్షిస్తున్న వీడియోను పోస్టు చేశారు. ఆ విడియో నే ఆమెను కటకటాల వెనక్కు వెళ్లేలా చేసింది.