హైదరాబాద్ లో నలభై రోజుల క్రితం అదృశ్యమైన పూర్ణిమ సాయి వ్యవహారం హాట్ టాపిక్. ఆ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి వెళ్లింది మొదలు మళ్లీ హైదరాబాద్ చేరుకునే వరకూ ఎన్నో పరిణామాలు.. ఎన్నో విశేషాలు.! స్పెషల్ క్లాస్ ఉందంటూ ఇంటి నుంచి బయలుదేరిన పూర్ణిమ సాయి నేరుగా సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంది. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి షిరిడి చేరుకుంది. షిర్డిలో సుమారు పదిహేను రోజులు గడిపిన పూర్ణిమ సాయి.. ఆ తర్వాత దాదర్ చేరుకుంది. అక్కడి పోలీసులు పూర్ణిమ సాయిని బాలికల వసతి గృహంలో చేర్పించారు.

Image result for అదృశ్యమైన పూర్ణిమ సాయి

పూర్ణిమ కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. నెల రోజులైనా కానీ జాడ దొరకలేదు. చివరకు పోలీసులే మీ అమ్మాయి ఫలానా చోట ఉందంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పూర్ణిమ పుట్టినరోజు నాడే ఈ శుభవార్త రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే దాదర్ బయలుదేరారు. తెల్లారేసరికి చేరుకుని ఎప్పుడెప్పుడు పూర్ణిమను కలుద్దామా అని ఎదురుచూశారు. కానీ అక్కడికెళ్లాక సీన్ రివర్సైంది. హైదరాబాద్ నుంచి వచ్చిన తన తల్లిదండ్రుల మొహం చూసేందుకు కూడా పూర్ణిమ సాయి ఒప్పుకోలేదు. అంతేకాదు.. తల్లిదండ్రులతో కలిసి వెళ్లేందుకు కూడా ఇష్టం లేదని తేల్చిచెప్పింది. దీంతో తల్లిదండ్రులు హైదరాబాద్ కు తిరిగి రాక తప్పలేదు.

Image result for అదృశ్యమైన పూర్ణిమ సాయి

హైదరాబాద్ లో కిడ్నాప్ కేసు నమోదవడంతో ముంబై పోలీసులు పూర్ణిమ సాయిని ఇక్కడికి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా పూర్ణిమ సాయి తల్లిదండ్రులను కలిసేందుకు కానీ, వారితో మాట్లాడేందుకు కానీ, వారితో ఇంటికి వెళ్లేందుకు కానీ అంగీకరించడం లేదు. తల్లిదండ్రులకు, పూర్ణిమ సాయికి మధ్య అంత గ్యాప్ ఎందుకొచ్చింది..?

Image result for అదృశ్యమైన పూర్ణిమ సాయి

పూర్ణిమ సాయి కేసు తల్లిదండ్రులు – పిల్లల మధ్య ఉన్న గ్యాప్ ను స్పష్టం చేస్తోంది. పూర్ణిమసాయికి సినిమాలంటే పిచ్చి అని, అందుకే ఆమె ముంబై చెక్కేసిందనేది ఓ వార్త. అదే సమయంలో తాను తల్లిదండ్రులను చూసినా, వారి దగ్గర ఉన్నా వారికి అరిష్టం కలుగుతుందని, అందుకే ఏడాదివరకూ తాను వారితో ఉండనంటోందనేది మరో వార్త. ఈ అంశాలన్నింటినీ పక్కనపెడదాం. అసలు తల్లిదండ్రులను వదిలి వెళ్లాల్సిన అవసరం పూర్ణిమసాయికి ఎందుకొచ్చింది.?


సాధారణంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తుంటారు. ఈ కాఠిన్యం ఒక్కోసారి తల్లిదండ్రులను విలన్లుగా మార్చేస్తుంది. అలాంటప్పుడే పూర్ణిమ సాయి ఎదుర్కొంటున్న సమస్యలు లాంటివి వస్తాయి. పూర్ణిమ సాయికి సినిమాలంటే ఇష్టమని తల్లిదండ్రులకు తెలుసు. ఈ విషయాన్ని వాళ్లు కఠినంగా అణచివేయాలని చూశారు. ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకుని సర్దిచెప్పి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు. ప్రస్తుతం చదువులపై శ్రద్ధ చూపాలని, ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పి ఉంటే సరిపోయేది. వీలైతే సినిమా స్టార్ల లైఫ్ ఎలా ఉంటుందో చెబుతూనే ఆ రంగంలోని మంచిచెడులను వివరించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. అలా చేయలేదు.

Image result for అదృశ్యమైన పూర్ణిమ సాయి

ఇక రెండోది పూర్ణిమ సాయి మెంటాలిటీ. సినిమాలపై మోజు ఉండడం వల్లే ముంబై దాకా వెళ్లందనుకుందాం.. తల్లిదండ్రులు వెళ్లనప్పుడు ఎందుకు కలవలేదు. వారి మొహం ఎందుకు చూడనంటోంది..? ఇందుకు పూర్ణిమ చెప్పే కారణం – వారిని చూస్తే అరిష్టం జరుగుతుందని.! చదువుసంధ్యలు ఇలాంటి మూఢనమ్మకాలను పారదోలాలి కానీ వారిలో వాటినే నమ్మే పరిస్థితి తీసుకురాకూడదు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి నమ్మకాలున్నాయా అనే సందేహం చాలా మందికి కలగచ్చు. కానీ ఇందుకు తొలి వేదిక ఇల్లే. ఆ పని చేయొద్దు.. ఈ పని చేయొద్దు.. లాంటివన్నీ ఇంటి నుంచే మొదలవుతాయి. అలా చేస్తే దేవుడు శిక్షిస్తాడు .. ఇలా చేస్తే కీడు జరుగుతుంది.. అని చెప్పడం వల్లే పిల్లల్లో మూఢనమ్మకాలు మొదలవుతాయి.

Image result for అదృశ్యమైన పూర్ణిమ సాయి

ఇక పిల్లల్లోని బుద్ధి వికాసాలను స్కూళ్లలో టీచర్లు మరింత పదునుపెట్టి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి. కానీ చాలా స్కూళ్లు పిల్లల్లను బట్టీ చదువులకే పరిమితం చేస్తున్నాయి. పాఠాల్లోని సారాంశాలను నిజజీవితానికి అనునయించి.. వారిలో మంచిచెడుల పట్ల అవగాహన కల్పించాలి. కానీ ఇప్పుడు చదువులు అలా ఉన్నాయా..? కేవలం మార్కులకోసమే పిల్లలను రుద్దుతున్నాయి. దీంతో వారిలో సున్నతత్వం లోపిస్తోంది. ఏది మంచి, ఏది చెడు.. అని స్వయంగా ఆలోచించేంత స్థాయిలో కూడా నేటి పిల్లలు ఉండట్లేదు. పూర్ణిమ సాయి వ్యవహారంలో మొదటి ముద్దాయిలు తల్లిదండ్రులైతే.. రెండో ముద్దాయిలు ఉపాధ్యాయులు. ఇకనైనా పిల్లల ఇష్టాయిష్టాలను గుర్తించి అందుకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: