అమ్మ అంటే ఆ దేవుడు ఇచ్చిన వరం అని అంటారు..దేవుడు తనకు బదులుగా అమ్మను మనిషికి వరంగా ఇచ్చాడని అంటారు.  అమ్మ ప్రేమను విలువ కట్టలేమన్న విషయం జగమెరిగిన సత్యం.  అలాంటి అమ్మతనానికి మచ్చ తెచ్చింది..కన్న కూతుర్ని చంపి.. ఆమె మృతదేహాన్ని ఊరికి దూరంగా తీసుకెళ్లి తగలబెట్టింది.  ఈ నిజాలు తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. దేశంలో సంచలనం సృష్టించిన కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్‌ శ్యామ్‌వర్‌ రాయ్‌ ముంబై కోర్టులో దిమ్మతిరిగే విషయాలు చెప్పాడు.

షీనా బోరా కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్‌ శ్యామ్‌వర్‌ రాయ్‌, ఇంద్రాణి భర్త పీటర్‌ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్‌ఖన్నాను అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం నాటి విచారణ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో షీనాను హత్య చేసిన విధానం వివరించాడు.   విదేశాల నుంచి వచ్చిన ఇంద్రాణి.. కారులో ముంబై సమీపప్రాంతాలను పరిశీలించిందన్నాడు. అనంతరం, షీనాబొరాకు మత్తుమందు కలిపిన నీటిని తాగించి కారులో తీసుకువెళ్లాం.
Image result for indrani driver Shyamvar Rai
దారిలో మెడిసిన్‌ కాక్‌ టెయిల్‌, ఆల్కహాల్‌ ఇచ్చాం. సరిగ్గా అప్పుడు ఇంద్రాణి ఆమెకు ఎదురుగా కూర్చుంది. వెనుకాలే కూర్చున్న ఇంద్రాణి మాజీ భర్త షీనా జుట్టును గట్టిగా పట్టుకోగా ఒక్కసారిగా ఇంద్రాణి ఆమె గొంతును నులిమింది. కారులోనే ఆమెను ఇంద్రాణి గొంతు నులిమి చంపింది. ఇంద్రాణి ఆమె ముఖంపై కూర్చుని 'ఇదిగో నీ ఫ్లాట్‌ ఇక్కడే ఉంది.
Image result for indrani driver Shyamvar Rai
ఎక్కడైనా పోలీసులు ఆపితే అనుమానం రాకుండా.. షీనా జుట్టును ముడివేసి, ఆమె పెదాలకు లిప్‌స్టిక్‌ వేశారు. దారిలో ఒకచోట షీనా మృతదేహాన్ని చెట్ల మధ్యకు తీసుకెళ్లారు. సంజీవ్‌ ఖన్నా షీనా మృతదేహంపై పెట్రోలు కుమ్మరించగా.. ఇంద్రాణీ నిప్పు పెట్టింది’’ అని వివరించాడు.  ఇక జరిగిన విషయాలు ఎవరితో చెప్పకు.. చెబితే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని ఇంద్రాణి బెదిరించినట్లు వివరించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: