గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు  అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు.  ఇక టాలీవుడ్ కి సంబంధించిన కొంత మందిని సిట్ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.  అయితే డ్రగ్స్ ముఠా అరెస్టు అయిన తర్వాత ఎన్నో  భయంకర నిజాలు బయట పడ్డాయి.  డ్రగ్స్ మహమ్మారికి యువతనే కాదు విద్యార్థులు కూడా బలైనట్లు నమ్మలేని నిజాలు బయటకు వచ్చిన నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది.  ఇక ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై నానా యాగి చేశారు.  

తాజాగా తెలంగాణలో డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని, మాదకద్రవ్యాల మహమ్మారిని వెంటనే అరికట్టి, దీని వెనకున్న పెద్దలను శిక్షించాలని డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ నుంచి సిట్‌ ఆఫీస్‌ వరకు పాదయాత్రకు టీటీడీపీ నేతలు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అసెంబ్లీ వైపు బయలుదేరగా, ట్యాంక్ బండ్ సమీపంలో పోలీసులు ఆపారు.

అయితే రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడం తప్పా..? అందుకు అరెస్టు చేస్తారా..? అని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అయితే  అనుమతిలేని యాత్ర కాబట్టి అడ్డుకున్నామని స్పష్టం చేసిన పోలీసులు, రేవంత్ ను అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: