మన జాతీయ పతాకం మువ్వన్నెల జెండా అనే విషయం అందరికీ తెలిసింది. కుల, మత, జాతి బేధాలతో సంబంధం లేకుండా భారతదేశాన్నంతటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేది జాతీయ జెండానే. అందుకే జాతీయ జెండా విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించింది మన రాజ్యాంగం. రాజ్యాంగంలో పేర్కొన్న వివరాల ప్రకారం...

Image result for national flag

  1. జాతీయ పతాకాన్ని ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి.
  2. మన జాతీయ జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి.
  3. ఇటీవలికాలంలో చైనా జెండాలు మన దేశంలో నలుమూలలకూ పాకాయి. అయితే జాతీయ జెండా నియమ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ జెండాల వాడకం నిషేధం.
  4. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు మూడూ పై నుంచి కిందకు సమానంగా ఉండాలి.
  5. జెండాను నేల మీద కానీ, నీటి మీద కానీ పడేయరాదు.
  6. జెండాపై ఎలాంటి రాతలు, సంతకాలు, ప్రింటింగులు చేయరాదు.
  7. పతాకం ఎప్పుడూ నిటారుగా తల ఎత్తుకుని చూసేలా ఉండాలి. కిందికి కానీ, పక్కకు కానీ వంచరాదు.
  8. పతాకాన్ని వేగంగా ఎగురవేయాలి.
  9. సూర్యోదయం, సూర్యాస్తమయాల మధ్యలోనే జాతీయ జెండాను ఎగురవేయాలి.. దించేయాలి.
  10. పతాకం మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులు స్పష్టంగా ఉండాలి.
  11. జెండా పాతబడితే దాన్ని ఇతర అవసరాలకోసం వాడకూడదు. ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు. వెంటనే దాన్ని కాల్చేయాలి.
  12. వివిధ రకాల జెండాలతో జాతీయ జెండాను ఎగురవేయాల్సి వస్తే... జాతీయ పతాకం మిగిలినవాటికంటే ఎత్తులో ఉండాలి.
  13. జెండాను ఎగుర వేసేటప్పుడు జాతీయ నాయకుల ఫోటోలను ఉంచాలి.
  14. జాతీయ జెండాను కట్టేటప్పుడే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఎగరేసిన తర్వాత దించి.. మళ్లీ ఎగురవేయడం లాంటివి చేయకూడదు.
  15. జెండా వందనాన్ని నిబద్ధతతో చేయాలి. ఆ సమయంలో నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
  16. జేబులకు పెట్టుకునే చిన్న జెండాలను ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు. వాటిని తొక్కరాదు.

Image result for national flag

మరింత సమాచారం తెలుసుకోండి: