తమిళనాట కొత్త రాజకీయ చర్చ కి తెర లేచింది. తమిళ ప్రధాన ప్రతిపక్షం పార్టీ డీఎంకే ఆధ్వర్యం లో నడిచే మురసోలి పత్రిక వార్షికోత్సవం ప్రోగ్రాం కి ఆ పార్టీ నేత స్టాలిన్ రావడం మామూలే అయితే, స్టాలిన్ తో పాటుగా సినిమా హీరోలు కమల్ హసన్ , రజినీకాంత్ అక్కడ కనపడ్డారు.


ఈ సభ వేదిక మీద కమల్ , రజిని దగ్గరలో కూర్చుని కనపడ్డం విశేషం. ఈ సభ కి తను వెళుతున్నట్టు రజినీకాంత్ ఎవ్వరి దగ్గరా చెప్పలేదు ప్రస్తావించ లేదు కూడా. సడన్ గా ఆయన అక్కడ ప్రత్యక్షం అవ్వడం తో రజినీకాంత్ కి సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.


తమిళ ప్రజల్లో వస్తున్న మాటల ప్రకారం కమల్ - స్టాలిన్ పక్క పక్కనే కూర్చుని మంతనాలు సైతం సాగిస్తూ కనిపించారు. దీంతో క‌మ‌ల్ డీఎంకేలో చేర‌తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


రజనీకాంత్, స్టాలిన్‌, క‌మ‌ల్ ఒకే చోట క‌నిపించ‌డం ఆస‌క్తికరంగా మారింది.  రజినీకాంత్ కూడా త్వరలో ఈ ఆగస్ట్ 15 తారీఖు లోగా  కొత్త పార్టీ పెట్టె ఆలోచనలో ఉండడం తో ఈ కలయిక కి ప్రాధాన్యత ఏర్పడింది.  త‌మిళ రాజ‌కీయాలు ఎటువైపు ప‌య‌నిస్తాయ‌న్న ఆస‌క్తి నెల‌కొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: