గత కొంత కాలంగా భారత దేశంలో మహిళలపై కొంత మంది కామాంధులు చేస్తున్న అరాచక చర్యలు, అత్యాచారాలు, హత్యలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ది చెందుతుంతో..అంతే విధంగా దారుణాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో  అశ్లీల చిత్రాల ప్రభావం యువతపై పడుతుంది.  
Image result for blackmail
మరోవైపు మహిళా సంఘాలు ఇలాంటి ఫోర్న్ సైట్లను బ్యాన్ చేయాలని చెబుతూనే ఉన్నారు.  ఈ మద్య కొంత మంది దుర్మార్గులు ఆమ్మాయిల నగ్నంగా ఫోటోలు తీస్తూ..తమతో ఏకాంతంగా గడిపినది వీడియో తీస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. మరికొంత మంది ఇలాంటివి చూపిస్తూ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నారు.  
Related image
తాజాగా ఓ ఆగంతకుడు వాట్సాప్ మెసేజ్ పంపిన ఉదంతం బెంగళూరు నగరంలో వెలుగుచూసింది.  ఓ అమ్మాయికి అభ్యంతరకరమైన చిత్రాలను  సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరిస్తూ వాట్సాప్‌ లో సందేశం పంపించాడు. దీంతో భయపడిన అమ్మాయి అపరిచితుడి వాట్సాప్ నంబరు, ఫేస్‌బుక్ ఖాతాలను బ్లాక్ చేసింది.

దీంతో వాట్సాప్ నంబరు, ఫేస్‌బుక్ ఖాతాలను బ్లాక్ చేసినా తల్లి పేరిట ఉన్న వాట్సాప్ నంబరుకు బెదిరింపు మెసేజ్ వచ్చింది.  దీంతో బెదిరిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ సెక్షన్ 67, 66, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అపరిచితుడి కోసం గాలిస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే..ఆ యువతికి మెసేజ్ పంపిస్తున్న యువకుడితో  పరిచయం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.



మరింత సమాచారం తెలుసుకోండి: