నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఫలితాల త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నంద్యాల‌లో టీడీపీ విజ‌యానికి పోలీసుల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రు సాయం చేశార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ఈ విజ‌యాన్ని చంద్ర‌బాబు త‌మ గెలుపు అని భావిస్తే అంత‌కు మించిన మూర్ఖ‌త్వం ఉండ‌ద‌ని జ‌గ‌న్ అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక చంద్ర‌బాబు మూడేళ్ల పాల‌న‌కు రిఫ‌రెండం కాద‌ని, త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకున్న 20 స్థానాల్లోను వారి చేత రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు వెళితే దాన్ని తాము రిఫరెండంగా భావిస్తామని జ‌గ‌న్ చెప్పారు.


ఇక శిల్పా సోద‌రులు చాలా కష్ట‌ప‌డ్డార‌ని, అయితే చంద్రబాబు అబద్ధాలే విజయం సాధించాయన్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి ఆరేళ్ల తన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నందుకుకు ఆయ‌న‌కు అధికార పార్టీలోనుంచి వ‌చ్చి వైసీపీ త‌ర‌పున పోటీ చేసినందుకు శిల్పా మోహ‌న్‌రెడ్డికి త‌న హ్యాట్సాప్ అని జ‌గ‌న్ చెప్పారు. చంద్ర‌బాబు ఓట‌ర్ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేశార‌ని కూడా జ‌గ‌న్ ఆరోపించారు.


నంద్యాల ఉప ఎన్నిక ఓకే చోట జ‌ర‌గ‌డంతో చంద్ర‌బాబు అక్క‌డే రూ. 200 కోట్లు ఖ‌ర్చు చేయ‌డంతో పాటు మంత్రులంద‌రిని అక్క‌డే కూర్చోపెట్టి, పోలీసులంద‌రిని బెదిరించి వాడుకున్నార‌ని, అలాంటి ఈ ఎన్నిక‌ను రెఫ‌రెండం అని ఎలా అంటార‌ని జ‌గ‌న్ మీడియాకు ఎదురు ప్ర‌శ్న‌వేశారు. ఇక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌ను రెఫ‌రెండం అన్న వాళ్ల‌కు సెన్స్ ఉండాల‌ని కూడా జ‌గ‌న్ అన్నారు. 


ఇక త‌మ పార్టీ గుర్తుమీద గెలిపించిన వాళ్ల‌ను త‌న పార్టీ గుర్తుమీద గెలిపించుకునే ధైర్యం, కాన్ఫిడెన్స్ చంద్ర‌బాబుకు లేద‌ని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. పాలిటిక్స్‌లో ఉండాల్సింది ధైర్యముండాల, ఎదుటి వాడు గ‌ట్టిగా కొడితే తాను అంత‌క‌న్నా గ‌ట్టిగా కొడ‌తాన‌న్న‌దే గెలుపుకు నాంది అన్న జ‌గ‌న్ మా టైం వ‌స్తుంది...అప్పుడు మేం కొడ‌తాం అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: