తెలంగాణ మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్ లో ఏడున్నర లక్షలమందికి పైగా మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అది కూడా కేవలం మూడ్రోజుల్లో ఇంతపెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేయబోతుండడం ఆసక్తి కలిగిస్తోంది..

 Image result for BATHUKAMMA SAREES

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 7,66,983 మంది మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయ‌డానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. ఈ నెల 18, 19, 20వ తేదీల‌లో చేప‌ట్ట‌నున్న బ‌తుక‌మ్మ చీరల పంపిణీ ఏర్పాట్ల‌ను రెవెన్యూ, మ‌హిళా శిశు సంక్షేమ‌, వైద్య‌, ఆరోగ్యశాఖ‌, విద్యాశాఖ‌ల అధికారుల‌ పర్యవేక్షిస్తున్నారు. ఆహార భ‌ద్ర‌త కార్డు ఉన్న మ‌హిళలందరికీ ఈ బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. రేషన్ షాపుల ద్వారా ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు పంపిణీ జరగనుంది.

Image result for BATHUKAMMA SAREES

ఆహార భ‌ద్ర‌త కార్డు క‌లిగిన మ‌హిళ‌లు త‌మ గుర్తింపుగా ఆధార్‌కార్డు లేదా ఫోటోగుర్తింపు కార్డు జిరాక్స్ కాపీని తీసుకొచ్చి చీర తీసుకోవచ్చు. ఈ చీర‌ల పంపిణీ మొత్తం ప్ర‌జా ప్ర‌తినిధుల స‌మ‌క్షంలోనే జరగనుంది. సంబంధిత కార్పొరేటర్ ఆధ్వర్యంలోనే దీన్ని నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.

Image result for BATHUKAMMA SAREES

బతుకమ్మ చీరల పంపిణీని ఓ పండుగలాగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ స్పష్టంచేసింది. స‌ర్కిల్ స్థాయిలో చీర‌ల పంపిణీ, ప‌ర్య‌వేక్ష‌ణ‌కు గాను ప్ర‌త్యేక క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తోంది. పంపిణీ కేంద్రాల వ‌ద్ద త‌గిన బందోబ‌స్తు, మంచినీరు త‌దిత‌ర మౌలిక స‌దుపాయ‌ల‌ను ఏర్పాటు చేయనుంది. ఓవరాల్ గా బతుకమ్మ చీరల పంపిణీ హైదరాబాద్ లో పండగ సందడి తీసుకురానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: