కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువైన నాటి నుంచి.. నేటి వరకు అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ సంపాదనా పరులు, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు.. ఏ క్షణంలో ఎవరు దాడులు చేస్తారో అని రోజులు లెక్కపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకు అనుగుణంగానే కేంద్రం సైతం వారిపై ఉక్కుపాదం మోపుతోంది. మొన్న కార్తి, నిన్న జయంతి నటరాజన్, రేపు లాలూ ప్రసాద్ యాదవ్. అసలు మోడీ స్ట్రాటజీ ఏంటి... వరుస దాడులతో ఎలాంటి హెచ్చరికలు ఇవ్వాలనుకుంటున్నారు. బడా నాయకులను టార్గెట్ చేయడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు..

Image result for modi cbi

కార్తి చిదంబరం... కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మారిషస్ నుంచి నిధులను స్వీకరించినందుకు కార్తి చిదంబరంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇంద్రాణి, పీటర్ ముఖర్జియా యాజమాన్యంలోని INX మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌ మీడియా గ్రూప్‌కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతులకు సంబంధించి ఈ కేసు నమోదైంది. నిందితులు నేరపూరిత అవినీతి, మోసం, కుట్రలకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. గత నెలలో చెన్నైలోని కార్తి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడుల నేపథ్యంలో.. కార్తి, ఇతరులపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసింది. 

Image result for karthi chidambaram

యూపీఏ హయాంలో కేంద్ర పర్యావరణ మంత్రిగా ఉన్న జయంతి నటరాజన్‌ చుట్టూ అవినీతి ఉచ్చు బిగుస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో చట్టాన్ని ఉల్లంఘించి... అటవీశాఖ భూములను గనుల కోసం అక్రమంగా కట్టబెట్టారనే ఆరోపణలపై FIR నమోదు చేసిన సీబీఐ.. చెన్నైలోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. జయంతితో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే, ఇతర సహచరులు, ఆత్మీయుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి.

Image result for jayanthi natarajan

అయితే ఈ రెండు కేసులకూ సంబంధం ఉందా..? సీబీఐ దూకుడు వెనుక కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా.. ఈ రెండు కేసులను కేంద్రం సీరియస్ గా తీసుకుంటే మరి తర్వాతి టార్గెట్ ఎవరు... అనే ప్రశ్నలు తలెత్తక మానవు. ఈ సందేహాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు తేజస్వి యాదవ్ ను సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే గడ్డి కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న లాలూ దీంతో మరిన్ని చిక్కుల్లో పడ్డారు. రైల్వే హోటళ్ల కాంట్రాక్టుల అక్రమ కేటాయింపుల కేసులో ఆయన ఈ సమన్లు అందుకున్నారు.

Image result for modi cbi

2006లో రైల్వేశాఖలో నిర్వహించిన టెండర్లలో అవతవకలు జరిగాయంటూ లాలూపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో లాలూ రైల్వేమంత్రిగా పనిచేశారు. పూరీ, రాంచిలోని రైల్వేస్‌లో హోటళ్లు నడుపుకొనేందుకు ప్రైవేటు వ్యక్తులకు లాలూ అక్రమంగా టెండర్లు కేటాయించినట్లు సీబీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జులై 7న లాలూ ఇళ్లలో సీబీఐ సోదాలు చేపట్టింది.

Image result for modi cbi

చాలా దగ్గర సంబంధం ఉన్న ఈ మూడు కేసులపై కేంద్రం సీరియస్ గా ఉందా... ఈ నేపథ్యంలోనే కార్తి చిదంబరం, జయంతి నటరాజన్, లాలూపై సీబీఐ అధికారులు వరుస దాడులు చేశారా అంటే అవుననే సమాధానలు వినిపిస్తున్నాయి. వరుస దాడులతో భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా... వారిని దారికి తెచ్చుకోవాలనే యోచనలో మోడీ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: