తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు బీభత్సంగా పడటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.  హైదరాబాద్  లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  రోడ్లు జలమయం కాగా, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. నిన్న అర్థరాత్రి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. నగరంలోని సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, మైత్రివనం, ఎర్రగడ్డ, ఎల్బీనగర్‌, సాగర్‌రింగ్‌రోడ్డు, భైరామల్‌గూడలో కుండపోత వర్షం కురిసింది.
Image result for hyderabad heavy rain
భారీ వర్షం కురవడంతో మల్కాజ్‌గిరిలో బండ్ల చెరువు పొంగిపొర్లింది.  మేడ్చల్ జిల్లా లోని నేరేడ్‌మెట్‌, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో బండ్లచెరువు పొంగి పొర్లుతోంది.. షిర్డీ నగర్‌, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, వెంకటేశ్వరనగర్‌లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  మరికొన్ని గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు సంబంధిత అధికారుల సమాచారం. చెరువులు, నాలాల పరిధిలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
Image result for hyderabad heavy rain
ఉప్పల్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. భారీగా వర్షం కురుస్తుండడంతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర మంత్రి పద్మారావు పునరావాస కేంద్రాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. నిరాశ్రయులుగా మారిన వారి గురించి చర్యలు తీసుకునే దిశగా జీహెచ్ఎంసీ అధికారులకు పద్మారావు ఆదేశాలు జారీచేశారు.  
Image result for hyderabad heavy rain
చెరువులు, నాలాల పరిధిలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఎమర్జెన్సీ టీంల కోసం 040-21111111 అనే ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని, ఈఈ, సర్కిల్ కమిషనర్లు ఫీల్డ్ లో ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: