కేంద్రం లో మోడీ చేసిన మంత్రి వర్గ విస్తరణ విషయం ఒక్కసారిగా అందరికీ ఆశ్చర్యం కలగజేసింది. మోడీ మార్చిన సీట్లలో నిర్మల సీతారామన్ కి రక్షణ మంత్రి బాధ్యతలు ఇవ్వడం పట్ల అందరూ సంతోష పడ్డారు. ప్రధాని మోడీ కీ నిర్మల కీ మధ్యన గొప్ప సయోధ్య ఏమీ లేదు, మోడీ నిర్మల ని పెద్దగా అభిమానించే వ్యక్తి అయితే కాదు.


కానీ ఆమెకి అలంటి కీలక శాఖ ఇవ్వడమే అసలు మతలబు. నిజానికి నిర్మల పదవి పీకేసి మరీ తమిళనాడు లోని కొందరు ప్రముఖుల్ని కేంద్ర మంత్రుల్ని చేస్తున్నారు అనే వార్తలు వచ్చాయి దానికి రివర్స్ లో ఆమె రక్షణ మంత్రి అయ్యారు. దీని వెనకాల ఆరెస్సెస్ ఆశీస్సులు ఉన్నాయి అంటున్నారు బీజేపీ సీనియర్ నేతలు. ఆరెస్సెస్ రెండు రకాలుగా వ్యక్తులని ఎంపిక చేసుకుంటుంది.


ఒకటి సంఘం సిద్దాంతాల పట్ల విధేయంగా ఉండేవారు రెండోది వారిలో ఉండే సమర్ధత. మోడీ ఎంపిక కూడా ఇదే విధంగా చేసారు వారు ఒకప్పుడు. నిర్మల సీతరామన్ ఒక మహిళా నేతగా ఫ్యూచర్ లో చాలా గొప్పగా ఉపయోగపడతారు అనేది ఆరెస్సెస్ ఐడియా అని తెలుస్తోంది.


సుష్మా స్వరాజ్‌ అనారోగ్యంతో పాటు స్మృతి ఇరానీ వివాదాల్లో చిక్కుకుపోవడం కూడా ఆమె పట్ల మొగ్గు తగ్గించిందట. ఇక మిగిలింది ఉమాభారతి. ఆమె సరిగ్గా పనిచేయడం లేదు గనక తొలగించాలనుకుంటే ఆరెస్సెస్‌ అడ్డుపడి కొనసాగాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: