తెలంగాణా లో జరుగుతున్న బతుకమ్మ చీరాల లొల్లి మామూలుగా లేదు, ప్రభుత్వం ఒక ప్లాన్ తో ఆడవారికి ఈ చీరలు పంచె ప్రోగ్రాం పెడితే అది రివర్స్ లో తెరాస ప్రభుత్వానికే దెబ్బ కొట్టింది. అధికారం లోకి వచ్చిన తరవాత కెసిఆర్ ఎదురుకొన్న అతిపెద్ద సమస్యగా దీని గురించి చెబుతున్నారు .


చూడడానికి చీరాల వ్యవహారమే కానీ చిన్నా చితకా ముచ్చట కాదు ఇది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సర్కారు బతుకమ్మ సందర్భంగా ఆడవారు అందరికీ చీరలు కానుకగా ఇవ్వాలి అనుకుంది .. అయితే సీన్ రివర్స్ అవ్వడం తో కెసిఆర్ తో సహా అందరూ షాక్ అయ్యారు. దీనిమీద కెసిఆర్ స్పందన ఇంకా వింతగా ఉంది.


చీరల పంపిణీ తీరు ఎలా జరిగింది అని సమీక్ష చేసిన కెసిఆర్ చిల్లర రాజకీయాలు పట్టించుకోవద్దు అంటూ సొంత పార్టీ నేతలకి సలహాలు ఇవ్వడం గమనార్హం. తెలంగాణ ఆడ‌ప‌డుచుల‌పై ‘సోద‌ర ప్రేమ‌’తో చీర‌లు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌నీ, దీన్ని కూడా రాజ‌కీయం చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు చూస్తే.. చివ‌రికి వారే దెబ్బ‌తినాల్సి వ‌స్తుంద‌న్నారు.


వారు ఎన్ని చీర‌లు త‌గుల‌బెడితే, అంత‌గా న‌ష్ట‌పోతార‌ని కూడా జోస్యం చెప్పారు. చీరాల గొడవ ని వీలైనంత లైట్ తీసుకోమంటున్నారు కెసిఆర్ . ఆయన దృష్టి లో ప్రతిపక్షం వారు తప్ప చీరలని ఎవ్వరూ ఛీ కొట్టలేదు. కానీ మీడియా సాక్షిగా వాటి క్వాలిటీ బాలేదు అని మహిళలు స్వచ్చందంగా రోడ్డు మీదనే కాల్చడం చూసాం మనం. వారికి ప్రేమగా కెసిఆర్ ఒక్క సంజయషీ చెప్పుకుని ఉంటె బాగుండేది అనే ఫీలింగ్ రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: