డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (డీసీఐ) ను ప్రైవేటీకరణ చేయబోతున్నారు అన్న భయంతో ఉన్న అక్కడి ఉద్యోగులు తాజాగా hero పవన్ కళ్యాణ్ ని హైదరబాద్ లో కలిసారు. తమ ని కాపాడగలిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే అని నమ్ముతున్న వాళ్ళు డీసీఐ విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ.


అక్కడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైద‌రాబాదుకి వ‌చ్చి, జనసేన పరిపాలన కార్యాలయంలో ప‌వ‌న్‌కి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుని, డీసీఐ సంస్థను ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టడం దారుణమైన విషయమని అన్నారు.


కేంద్ర ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ విమర్శలు చేసారు. ఇలా చేస్తే ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్రంగా నష్టపోతాయి అన్నారు అయన. ఈ ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్ ని ప్రైవేట్ ప‌రం చేస్తోంటే ఏపీ ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని నిల‌దీశారు.


త‌మిళ‌నాడులో ఇటువంటి ప‌నే చేయాల‌ని చూస్తే ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ ఉద్యోగుల‌కు అండ‌గా నిల‌బ‌డింద‌ని చెప్పారు. ఏపీ ప్రభుత్వం కేంద్రం తో కలిసి ఇలా ఉద్యోగులకి అన్యాయం చెయ్యడం ఏంటి అంటూ ఆయన సీరియస్ అయ్యారు. తమ పరిధి లోకి రాదు అంటూ ఏపీ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చెయ్యడం బాధాకరం అన్నారు కళ్యాణ్. ఒకేసారి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలని కలిపి పవన్ కళ్యాణ్ విమర్శించడం ఇదే మొదటి సారి.


మరింత సమాచారం తెలుసుకోండి: