భారత దేశంలో ప్రతిరోజు మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ప్రభుత్వ పరంగా ఎన్ని కఠిన చట్టాలు తీసుకున్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు.  ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందులో ఫోర్న్ చిత్రాల ప్రభావం యువతపై బాగా పడుతుందని నిపుణులు అంటున్నారు.  ఇలాంటి ఫోర్న్ చిత్రాల ప్రభావంతో టీనేజ్ యువత చెడు మార్గంలో పయనిస్తుందని..లైంగిక కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అందుకోసం ఉన్మాదులుగా మారుతున్నారని సైకాలజిస్టులు అంటున్నారు. 
Image result for rape image
దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఆడవారిపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మరికొంత మంది ఆకతాయిలు, కీచకులు శృంగార సమయంలో నగ్న చిత్రాలు, వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్ జిల్లా నీమ్ కా థానా గ్రామానికి చెందిన బాలిక(15)పై సామూహిక అత్యాచారం జరిగింది. 
Related image
వివరాల్లోకి వెళితే..తన తండ్రికి మందులు తీసుకోవడం కోసం గంగేశ్వర్ అగ్రీ గ్రామంలోని మెడికల్ షాపుకు బాలిక వెళ్లింది.  ఎప్పటి నుంచి ఆ బాలికపై కన్ను వేసిన కామాంధులు అక్కడికి వచ్చిన మహేంద్ర సింగి, రాజ్ బాలికను బైక్ మీద ఎక్కించుకుని వెళ్లారు. ఆరోజు రాత్రి ఆలస్యంగా ఇంటికెళ్లిన బాలిక తల్లిదండ్రులకు తన మీద జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. 

నిందితులిద్దరు గత కొన్ని రోజులుగా తనను వేధిస్తున్నారని, తన నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తల్లిదండ్రలకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు సదరు యువకులపై  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  నిందితులిద్దరు తనను ప్రతీరోజు వెంబడిస్తున్నారని, స్కూల్ కు వెళ్లే సమయంలో అడ్డుపడి నానా దుర్భాషాలాడుతున్నారని తెలిపింది. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసుల వేట కొనసాగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: