భారత దేశంలో ఎక్కువ శాతం నిరుద్యోగంతో ఇబ్బంది పడే వారు ఎంతో మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం నిరుద్యోగంతో జీవితంపై విరక్తి చెంది ఎంతో మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు..మరికొంత మంది స్వయం ఉపాధితో జీవితాన్ని వెల్లబుచ్చుతున్నారు.  అలాంటి నిరుద్యోగులకు 5 వేల రూపాయలు నెల నెలా పిలిచి ఇస్తామంటే..ఎగిరి గంతేస్తారు. అవునండీ ఇంత మంది ఆఫర్ ఎక్కడో కాదు..గుజరాత్ ఎన్నికల్లో నిరుద్యోగులకు వల వేయడానికి కాంగ్రెస్ పార్టీ వేస్తున్న పాచిక ఇది.
Image result for bjp
రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న వేళ..ఈ సరికొత్త " నగదు పంపిణీ" కార్యక్రమంతో యువతను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇప్పటికే గుజరాత్ లో కాంగ్రెస్, బిజెపిల మద్య హోరా హోరి యుద్దం కొనసాగుతుంది. 
Image result for congress
ఈ నేపథ్యంలో యువతను ఆకర్షించేందుకు ఇరు పార్టీ సభ్యులు కొత్త కొత్త ఆఫర్లు తీసుకు వస్తున్నాయి.  రేపో, మాపో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ గీచిన స్కెచ్ మరి యువత పడిపోతారా లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: