ఏపీలో వ‌చ్చే ఏడాది ఆఖ‌రులోనే సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌నే ప్ర‌చారం ఊపందుకున్న త‌రుణంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు త‌మ వార‌సుల‌ను ఇప్ప‌టినుంచే రంగంలోకి దించుతున్నారు. ఈ వార‌సుల హ‌డావిడి తెలంగాణ‌లో క‌న్నా ఏపీలోనే ఎక్కువుగా క‌నిపిస్తోంది. ప‌రిటాల సునీత‌, అయ్య‌న్న‌పాత్రుడు, గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు, బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి, నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది టీడీపీ సీనియ‌ర్లు త‌మ వార‌సుల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో రంగంలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ke krishna murthy కోసం చిత్ర ఫలితం

ఈ జాబితాలోనే డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తి కూడా ఉన్నారు. ఆయ‌న కూడా త‌న వార‌సుల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించేశారు. ఈ ప్ర‌య‌త్నంలో ఆయ‌న త‌న కుమారుడు పొలిటిక‌ల్ ఎంట్రీకి త‌మ్మ‌ళ్లు ఎక్క‌డ అడ్డు వ‌స్తారో ? అని వారిని వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌కు త‌ప్పించిన‌ట్టు కూడా క‌ర్నూలు జిల్లా పాలిటిక్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయాల పేరు చెపితే ముందుగా గుర్తుకు వ‌చ్చేది కేఈ ఫ్యామిలీ పేరే. అయితే అలాంటి ఫ్యామిలీ నుంచి ఇప్పుడు వార‌సుల పొలిటిక‌ల్ ఎంట్రీ ఆస‌క్తిక‌రంగా మారింది.


ఇక పత్తికొండ‌, డోన్ నియోజ‌క‌వ‌ర్గాలు రెండూ కేఈ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటున్నాయి. గ‌త రెండు ఎన్నిక‌ల్లోను సోద‌రుల‌కు పోటీ చేసే ఛాన్స్ ఇచ్చిన కేఈ ఇప్పుడు త‌న కుమారుల కోసం సోద‌రుల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని చెప్పేసిన కేఈ...రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోను త‌న ఇద్ద‌రు కుమారులే పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. దీనిని బ‌ట్టి ఆయ‌న త‌న సోద‌రుల‌ను ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే తెలుస్తోంది.

ke prabhakar కోసం చిత్ర ఫలితం

త‌న ఇద్ద‌రు త‌మ్ముళ్ల‌లో ఒక‌రికి ఏపీఐడీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇప్పించుకున్న కేఈ, మ‌రో త‌మ్ముడికి ఆర్థిక‌ప‌రంగా ల‌బ్ధి చేకూర్చిన‌ట్టు తెలుస్తోంది. ఇలా త‌న కుమారుల పోటీకి త‌మ్మ‌ళ్లు అడ్డు రాకుండా కేఈ ముందుగానే వాళ్ల ముంద‌రికాళ్ల‌కు బంధాలు వేశార‌న్న గుస‌గుస‌లు క‌ర్నూలు జిల్లాలో వినిపిస్తున్నాయి. అయితే కేఈ త‌మ్ముళ్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఏదోలా సైలెంట్‌గా ఉంటూ వ‌స్తున్నా వ‌చ్చే ఎన్నిక‌ల వేళ సీట్ల కోసం కుస్తీలు ప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని కూడా తెలుస్తోంది. కేఈ త‌మ్ముడ కేఈ ప్ర‌భాక‌ర్‌ అయితే ఇప్ప‌టికే చంద్ర‌బాబుపై ఎంతో రుస‌రుస‌లాడుతున్నారు. 


వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. త‌న‌కు ఏపీఐడీసీ చైర్మ‌న్ స‌రిపోద‌ని కూడా ఆయ‌న అస‌హ‌నంతో ఉన్నారు. మ‌రి త‌మ్ముళ్ల ఆలోచ‌న‌లో ఇలా ఉంటే కేఈ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న  ఇద్ద‌రు వార‌సుల‌ను నేరుగా ఎలా రంగంలోకి దించుతారా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌రి కేఈ వార‌సుల పొలిటిక‌ల్ ఎంట్రీ ఎలా ఉంటుందో ?  చూడాలి.

ke pratap కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: