గత కొంత కాలంగా భారత దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.  డ్రైవర్ నిర్లక్ష్యం, అతిగా మద్యం సేవించి వాహనాలు నడపడం..అనుకోని పరిణామాల వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదల వల్ల ఎన్నో వందల కుటుంబాలు రోడ్డు పై పడుతున్నారు. 

పెద్ద దిక్కు కోల్పోయి కొంత మంది..అంగ వైకల్యంతో మరికొంత మంది ఇలా తమ జీవితాల్లో చీకటి నంపుతున్నాయి..రోడ్డు ప్రమాదాలు.  తాజాగా కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మాండ్యా జిల్లాలోని షెట్టిహల్లి దగ్గర వేగంగా వెళ్తున్న వ్యాన్ చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 10 మృతి చెందగా.. 30 మందికి గాయాలయ్యాయి. 

వేగంగా వెళ్తున్న వ్యాను అదుపు తప్పి చెట్టును ఢీకొన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: