పోలవరం ప్రధాన కాంట్రాక్టర్ తొలగింపుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లే తెలుస్తోంది. కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నా చంద్రబాబు మాత్రం ట్రాన్స్ ట్రాయ్ ను తప్పించాలనే భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. పోలవరం కాంట్రాక్ట్ ను తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ చేస్తోంది. అయితే తీవ్ర ఆర్ధిక  ఇబ్బందుల్లో చిక్కుకుపోయిన ట్రాన్స్ ట్రాయ్... పనులను పూర్తి చేయలేకపోతోంది. చివరకు సబ్  కాంట్రాక్టర్లకూ డబ్బులు చెల్లించలేకపోతోంది. దీంతో వారు పనులు ఆపివేసారు.
Image result for ట్రాన్స్ ట్రాయ్
కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇబ్బందైనా రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది. అయితే అవి కిందదాకా చేరకపోవడంతో పనులు ఆగిపోతున్నాయి. చాలాకాలం ఒత్తిడి చేసిన ప్రభుత్వం చివరకు కాంట్రాక్టర్ ను తొలగించడం మినహా మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చింది. పోలవరం కాంట్రాక్టర్ తొలగింపు విషయంలో న్యాయప్రకారమే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Image result for ట్రాన్స్ ట్రాయ్
సెక్షన్ 60సీ ప్రకారం కాంట్రాక్టర్ పై నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలో మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక ఎర్త్ వర్క్, కాంక్రీట్ పనుల్లో జాప్యం జరిగితే ఊరుకునేది లేదని బాబు స్పష్టం చేశారు. చంద్రబాబు మాటలను బట్టి చూస్తే కాంట్రాక్టర్ తొలగింపు తప్పదని తెలిపోతోంది. అయితే కాంట్రాక్టర్ ను మార్చడానికి కేంద్రం ససేమిరా అంటోంది.

న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని, అంచనా వ్యయం పెరుగుతుందని కేంద్రం వాదిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కాంట్రాక్టర్ అయితే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయలేరనే అంటోంది. 2018లోగా ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. కేంద్రం కాదూ కూడదు అంటే ఆపై పడే భారాన్ని భరించడానికైనా సిద్ధమంటున్నారు. మరిప్పుడు కేంద్రం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: