అభివృద్ధి , సంక్షేమ పథకాల అమలులో ఇప్పటివరకు బిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు తన మంత్రిమండలిపై దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే తప్పకుండా మంత్రులు ప‌నితీరు కూడా బాగుండాలని చంద్రబాబు భావిస్తున్నాడు అందుకే ఇప్పుడు వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇస్తూ సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. ఆయ‌న తాజాగా వివిధ అంశాల‌పై భేరీజు వేసుకుని ర్యాంకులు కేటాయించారని తెలుస్తోంది.

nakka ananda babu కోసం చిత్ర ఫలితం

నియోజవర్గంలో వారి పనితీరు, తమ శాఖపై పట్టు, కార్యకర్తలతో ఉండే విధానం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, సమీక్షలు,సమావేశాలు, నిధుల విడుదల ఖర్చు, లెక్కలు, బాధ్యత, మిగతా వారితో వ్యవహరించే విధానం, తమ శాఖలో వచ్చే సమస్యల పై స్పందించే విధానం వంటి విషయాలను ముఖ్యంగా పరిశీలించి వీరికి ర్యాంకులు కేటాయించారు. దీనిలోనూ మూడు భాగాల కింద ర్యాంకులు ప్రకటించారు. బాగా పని చేస్తున్న వారు. సరిగా పని చేయలేని వారు..అస్సలు పనిచేయని వారు అంటూ మూడు భాగాల్లో ర్యాంకులు ఇచ్చారు


బాగా పనిచేస్తున్న వారిలో తొలి స్థానాన్ని గుంటూరు జిల్లాకు చెందిన నక్కా ఆనందబాబు దక్కించుకున్నారు. రావెల కిషోర్ బాబు స్థానంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆయన ప్రభుత్వ కార్యక్రమాలను బాగానే ప్రజల్లోకి తీసుకెళుతున్నారట. ఫలితంగా ఆయన పనితీరును మెచ్చుకున్నారు చంద్రబాబు. ఆయన తర్వాత తన సంక్షేమ శాఖ అధికారులతోను బాగా పనిచేయిస్తున్నారని ఈ ర్యాంకు ఇచ్చారట. హోం శాఖ మంత్రి చినరాజప్ప, ఇందన శాఖ మంత్రి కళా వెంకటరావు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డిలకు ఆ తర్వాత ర్యాంకులు వచ్చాయి. 

ap ministers list in telugu కోసం చిత్ర ఫలితం

మంత్రుల్లో మరీ నాసిరకంగా చివరి ర్యాంకులు వచ్చినవారిలో కొల్లురవీంద్ర, శిద్దా రాఘవరావు, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణల పనితీరు సరిగా లేదట. అందుకే వారిని తప్పిస్తారనే చర్చ సాగుతోంది. అదే సమయంలో సరిగా పని చేయని వారిని ముఖ్యమంత్రి మందలించారు. పైగా మంత్రులు పని తీరు సరిగా లేకపోతే తాను పదవి నుంచి తొలగించడమే కాకుండా, వచ్చే ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వడం కూడా కష్టమేనని హెచ్చరించారని తెలుస్తోంది. 


గంటా పనితీరు సరిగా లేదని మొదటి నుంచి చెబుతున్నా..అతన్ని తప్పించే సాహసం చేయడం లేదు. పైగా ఇప్పుడు మంత్రి నారాయణకు ఆయన వియ్యంకుడు అయ్యాడు. మరోవైపు కాపుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతోనే గంటా పోస్టు ఊస్ట్ కాలేద‌ని తెలుస్తోంది. మిగతా వారంతా రెండో కేటగిరీ కిందకు వస్తున్నారు. బాగా పని చేయని వారు కాదు..అలా అని తీసిపారేసేలా ఉండటం లేదట. అందుకే పనిచేయ‌ని మంత్రులంద‌రూ తమ పనితీరును మార్చుకోవాలని సూచిస్తున్నారు. 


chandababu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: