తమిళనాడులో కొంత కాలంగా రాజకీయాలు ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటి వరకు పన్నీరు సెల్వం, శశికళకు మద్య జరిగిన రాజకీయ యుద్దంలో అనూహ్యంగా ప్రస్తుతం తమిళనాడు సీఎం పళని స్వామి లాభ పడ్డారు.  ఇప్పుడు తమిళనాడు రాజకీయాలకు సినీమా రంగు పడబోతుంది.  భారత దేశంలో ఇప్పటి వరకు సినిమా నటులు కొత్త పార్టీలు పెట్టిన విషయం తెలిసిందే.  తాజాగా తమిళనాడులో మరో కొత్త పార్టీ రానుంది. సూపర్‌స్టార్ కమల్‌హాసన్ పొలిటికల్ ఎంట్రీ డేట్ దాదాపు ఖరారైంది. 

కమల్ తన కొత్త పార్టీ ఏర్పాటుపై త్వరలోనే ప్రకటిస్తానని స్వయంగా ఆయనే ప్రకటించడంతో ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరపడబోతోంది.  ఈ మేరకు కమల్ హాసన్ తన అభిమాన సంఘాలను కలిసి తన రాజకీయ ప్రవేశం గురించి చర్చించారు. అనంతరం పార్టీ స్థాపించి తీరుతానని ప్రకటించారు తన బర్త్ డే లోపు ఓ ప్రణాళికను ప్రిపేర్ చేస్తున్నట్లు సంకేతాలు అందించారు. అభిమానులతో విభాగాల వారీగా 50 సమావేశాలు ఏర్పాటు చేస్తానని, నిరాడంబరంగా పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతుందని కమల్ పేర్కొన్నారు. 

రేపు మంగళవారం తన 63వ పుట్టినరోజును జరపుకోనున్న కమల్ అదేరోజు రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. తన బర్త్ డే రోజున అభిమానులెవరూ వేడుకలు నిర్వహించవద్దని, వరద బాధితులను ఆదుకునే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే ఆయన పిలుపునిచ్చారు. అయితే కమల్ ప్రకటనతో రాజకీయ పార్టీ ఏర్పాటు పక్కా అని క్లారిటీ వచ్చినా అది ఎప్పుడనేదే ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: