కృష్ణమ్మ ఒడిలో నిన్న సాయంకాలం పవిత్ర సంగమం వద్ద బోల్తాపడిన బోటు ఘటనలో 17 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు.  మరోవైపు  గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు నిన్న సాయంత్రం నుంచి గాలింపు చేపట్టాయి.కాగా, బోటు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ దారుణం చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ముగ్గురు సీపీఐ నేత నారాయణ బంధువులు ఉన్నారు. బోటు ప్రమాద స్థలిని పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 
Image result for Vijayawada  boat capsizes
సహాయక చర్యలు పనితీరును దగ్గరుండి పరిశీలిస్తున్న బాబు. కాగా మృతుల సంఖ్య 19 కి చేరినట్లు చెబుతున్నారు.  బోటు ప్రమాదంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వాకర్స్ క్లబ్ పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన, గల్లంతైన వారి వివరాలను అధికారులు ప్రకటించారు. 

Image result for boat capsizes

Related image

మృతుల పేర్లు:
1) రాయపాటి సుబ్రహ్మణ్యం (60)  
2) పసుపులేటి సీతారామయ్య (64)
3) కె.ఆంజనేయులు (58)  
4) కోవూరి లలిత (35)  
5) వెంకటేశ్వరరావు (48)
6) రాజేశ్‌ (49)  
7) హేమలత (49)  
8) దాచర్ల భారతి (60)  
9) కోటిరెడ్డి (45)
10) ప్రభాకర్‌రెడ్డి (50)  
11) అంజమ్మ (55)  
12) వెన్నెల సుజాత (40)
13) గుర్నాధరావు  
14) కోవూరి వెంకటేశ్వరరావు(40)  
15) సాయిన కోటేశ్వరరావు
16) సాయిన వెంకాయమ్మ  
17) హారిక 
18) నితీష్ రాయ్
గల్లంతైన వారి పేర్లు:
1) వెన్నెల రమణమ్మ  
2) కారుదారు ఉషారాణి  
3) గాజర్ల శివన్నారాయణ
4) పోల కోటేశ్వరరావు  
5) పోల వెంకాయమ్మ  
6) బిందుశ్రీ
7) కూరపాటి నారాయణరాజు


మరింత సమాచారం తెలుసుకోండి: