నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం కల్తీలకు అడ్డాగా మారుతోంది. అటు విజయవాడ, ఇటు గుంటూరు రెండుచోట్లా కల్తీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. గుంటూరు జిల్లా పచ్చళ్లు, కారంతో పాటు పలు రకాలుగా కల్తీలకు రాజధానిగా మారుతుందని స్వయంగా ఆహార కమిషన్ ఛైర్మన్ పుష్పరాజే అంటున్నారు. కల్తీల నియంత్రణకు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని అంటున్నారాయన.

Image result for కల్తీ నూనె

అటు విజయవాడ కూడా కల్తీకి అడ్డాగా మారుతోంది. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా పరిస్ధితి తయారైంది. కాసుల కోసం కక్కుర్తి పడిన కొందరు పదార్ధాలతో ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఇప్పటి వరకు భారీగా కల్తీ నూనెలు, నెయ్యి, టీ పొడి, ఆహరపదార్ధాలు పట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా చిన్నపిల్లలు తినే తినుబండారాలనూ వదలిపెట్టడంలేదు.

Image result for కల్తీ నూనె

విజయవాడ ఆటోనగర్ లో అశోకా ఎంటర్ ప్రైసెస్ గోడౌన్ లో పెద్దఎత్తున కల్తీ తినుబండారాలను విజిలెన్స్, ఆహార నాణ్యత తనిఖీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కల్తీ తినుబండారాలు తిని గత నెలలో ఏలూరులో ఓ చిన్నారి చనిపోయింది. ఆ పదార్థాలు ఇక్కడ తయారైనవే. రింగ్స్ పేరిట తయారు చేస్తోన్న ఈ పదార్ధాలన్నీ ప్రమాదకరమైనవని పరీక్షల్లో నివేదిక వచ్చింది.

Image result for కల్తీ నూనె

ఈ రింగ్స్ పరిశ్రమ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆహారపదార్ధాలపై నిషేదించే చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల సమావేశం నిర్వహించిన ఆహార కమిషన్ చైర్మన్ పుష్పరాజ్... పత్రికల్లో వచ్చిన కథనాలపై నాలుగు కేసులను సుమోటోగా తీసుకొని విచారిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 కేసులు వచ్చాయని.. విచారించి నివేదికలను ఇవ్వాలని ఆదేశించామని ఫుడ్ కమిషన్ ఛైర్మన్ పుష్పరాజ్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: