ధర్మం ఎంత కఠినం అన్నది ఇప్పుడు తెలిసివస్తోంది.అధర్మపు పనులను అవలీలగా చేసిన కాంగ్రేస్ ను అతలాకుతలం చేస్తోంది. ధర్మాన రాజీనామాలో ధర్మ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతోంది. మోపిదేవి రాజీనామాను జెట్ స్పీడ్ తో ఆమోదించిన ముఖ్యమంత్రి ధర్మాన రాజీనామా విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆయనేమి పార్టీని వీడడంలేదు. తన పరిస్థితికి పార్టిపెద్దలే కారణమని వేరుకుంపటి పెట్టడంలేదు. నైతిక భాద్యత వహించి ఇటీవల కాలంలో ఆపదానికే తలవంపులు తెచ్చిన కాంగ్రేస్ కు కొంచెం పరువుప్రతిష్టలు తెచ్చిపెట్టారు.అయినా సరే ధర్మ నిర్ణయాన్ని తీసుకోవాడానికి కాంగ్రేస్ ధడధడలాడుతోంది. నిజం నిప్పులాంటింది,ధర్మం కఠినమైనది ఈవిషయాలు వేదికపైకి ఎక్కి వల్లించే నేతలకు పాటించాల్సి వచ్చినపుడు తెలిసి వస్తోంది వాటి పవరేమిటో. భారతదేశపు చిహ్నం మూడు సింహాలు,నినాదం ధర్మోరక్షితి రక్షిత:.అంటే ధర్మాన్ని నీవు రక్షిస్తే అదినిన్ను రక్షిస్తుంది. కాని ఇప్పుడు కాంగ్రేస్ ను అది భక్షిస్తోంది. దీని అర్థం ఏమిటి కాంగ్రేస్ రాష్ట్రంలో ధర్మాన్ని వీడి పాలించింది అన్నది స్పష్టమవుతోంది. ప్రాణం పోసేదే ప్రాణం తీస్తుంది అన్నది ఇప్పుడర్థమవుతోంది. ధర్మాన రాజీనామా ఆమోదిస్తే ఎంత ముప్పో, ఆమోదించకపోయినా అంతే నష్టం. కాలయాపన చేసి కాలం వెల్లదీయాలనుకుంటే కూడా ఆఅవకాశము లేదు.రేపోమాపో విచారణకు అనుమంతించాల్సి వస్తుంది.మోపిదేవి విషయంలో జరిగినట్టే విచారణలో నేరానికి రుజువులు దొరికాయని అరెస్టుచేసి కస్టడీకి తీసుకోవాల్సి రావచ్చు.అంటే ఆయన రాజీనామా ఆమోదించడం తప్పనిసరి అవుతుంది.అంతదాక పరిస్థితి రానిస్తే ఇప్పుడున్న పరువు కూడా గంగలో కలుస్తుంది. ఆపరిణామాలు జరుగుతున్న క్రమంలో విపక్షాలు మరింత పరువుతీసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమోదిస్తే వెంటనే మరో నలుగురు మంత్రులు అదే బాటలో వెల్లాల్సి వస్తుంది.అదేజరిగితే సగం క్యాబినెట్ తో ప్రభుత్వాన్ని నడపడం కష్టం.అంతేకాదు...సగం క్యాబినెట్ కలంకితులని తేలాక ఆప్రభుత్వం కొనసాగడం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మంత్రి ధర్మాన పాటిస్తున్న నైతికత ధర్మాన్ని అప్పుడు ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: