ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ రివర్షన్ ఇచ్చరు. ఆయనకు మొదట సమైక్యాంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాస్థ్రంగా పదోన్నతి కల్పించారు. కాని ఆ అస్త్రం అంత పవర్ ఫుల్ కాదని తేలిపోవడంతో ఇక లాభం లేదని దానిని హైదరాబాద్ మీదకు ప్రయోగించారు. ఇక సిఎం కిరణ్ ఇప్పుడు హైదరాబాద్ చాంపియన్ గా అవతరించబోతున్నారని ప్రచారం మొదలయింది.

రాష్ట్రమే పోయాక హైదరాబాద్ ను పట్టుకుని పాకులాడితే ఏం వస్థుంది అనుకుంటున్నారా... హైదరాబాద్ ను గెలిస్థే, ఆటోమేటిక్ గా సిఎం కిరణ్ సీమాంధ్రకు సిఎం అయినట్టేనట. అందుకు సిఎం కిరణ్ మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నాడన్న వార్థలు వెలుబడుతున్నాయి. హైదరాబాద్ ను శాశ్వత కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి పక్కా స్కెచ్ వేసాడట. అది సాదించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారట.

అందుకే ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకోవడమే కాకుండా తన సహచర మంత్రులను రాజీనామా చేయకుండా నిరోదించాడని ఇప్పుడు కాంగ్రేస్  వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లేని తెలంగాణ పూర్థిగా వేస్ట్ అన్నది అందరికి తెలిసిందే, అదే దానికి దక్కకుండా చేస్థే తెలంగాణను చావుదెబ్బ తీసినట్టేనని, ఆతరువాత తెలంగాణ వారు దిక్కు తోచక మళ్లీ పాతరాష్ట్రమే కావాలని మళ్లీ కాళ్ల బేరానికి రాక తప్పదన్నది తాజాగా కిరణ్ వేసిన లేటెస్టు స్కెచ్.

ఇందులో సక్సెస్ అయితే శభాష్ కిరణ్ అంటూ సీమాంధ్ర ఆయనను భుజాలపైకి ఎక్కించుకుంటుంది, పైగా సీమాంధ్రలో జగన్ కు బదులు కాంగ్రేసే హీరో అవుతుంది అన్న ప్రతిపాదన సోనియా ముందుంచి అందులో పలితం సాధిస్థాం అంటూ కిరణ్ కోటరీ ధీమాగా ఉంది. ఏం జరుగుతుందో, ఈసారైనా బ్రహ్మాస్థ్రం పని చేస్థుందా అంటే వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: