గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి మధ్య మాటల యుద్దం సాగుతుంది.  గెలుపు కోసం ఇరు పక్ష నేతలు నువ్వా..అంటే నువ్వా అన్న విధంగా ప్రచారాలు కొనసాగించారు.  నేటితో గుజరాత్ లో తొలిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది.  అయితే గుజరాత్ లో కాంగ్రెస్ గట్టి పట్టుమీదే ఉంది. అంతే కాదు తమకు మద్దతుగా పటీదార్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్‌ ని మద్దతు కోరిన విషయం తెలిసిందే.  అయితే గత కొంత కాలంగా హార్థిక్ పటేల్‌కు చెందిన ఓ సెక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Image result for hardik patel sex vedio
ఇటువంటివి మరిన్ని వీడియోలను విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అప్పట్లో హార్ధిక్ పేర్కొన్నారు.ఈ వీడియోలు బుధవారం వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.  తాజాగా వెలుగు చూసిన వీడియో మూడోది కావడం గమనార్హం. గత నెలలో రెండు సెట్ల వీడియోలు వైరల్ కాగా, తాజా సెట్ వీడియోలు నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు గతంలో విడుదల చేసి వాటికి కొనసాగింపుగా ఉన్నాయి. వీటిలో హార్ధిక్ మరో ఇద్దరితో కలిసి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నారు.
Image result for hardik patel sex vedio
తాజా వీడియోపై పటీదార్ అనామత్ ఆందోళన సమితి కో కన్వీనర్ దినేశ్ బంభానియా మాట్లాడుతూ ఇది డాక్టరింగ్ (మార్ఫింగ్) చేసిన వీడియో అని పేర్కొన్నారు. ఈ వీడియోల్లో ఉన్నది అవాస్తవమని తాము పదపదే చెబుతున్నామని, బీజేపీనే వీటిని డాక్టరింగ్ చేసిందని ఆరోపించారు. అయితే తాజా వీడియోలపై స్పందించేందుకు హార్ధిక్ అందుబాటులోకి రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: