దీర్ఘకాల ఋణాలను తెచ్చి సాధరణ ఖర్చులు అంటే ఆడంబరాలకు డంబాచారాలకు పుష్కరాలు పండుగలకు ప్రతిపనికి శకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కుల మత కార్పోరేషణ్లకు తలకొంత పంచేసి దర్జాగా కాలం గడపటం దుబారా ఖర్చులు చేసేయటం వలన ఆస్తులు సృష్టించవలసిన చోట టీలు టిఫిన్లు భోజనాలు చేఅయటానికి వినియోగిస్తే రాష్ట్రం దివాలా తీయటం తప్పదు. అయినా ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికే ఆ దారిలోనే పయనిస్తుందని పిస్తుంది. ఖర్చులు పెట్టటానికి ఒక విధానమూ ఉంది “ఎఫ్ ఆర్ బి ఎం చట్టం”  దానికి లోబడి పనిచేయవలసిన అవసరం ఏపి పూర్తిగా మరచిపోయింది.
andhra pradesh in big debt trap కోసం చిత్ర ఫలితం

ఎఫ్‌.ఆర్‌.బీ.ఎం (ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) చట్టం ఉండగా పరిమితుల్ని, నిబంధనలను అతి క్రమించి ఎలా అప్పు చేస్తున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ సమాధానం లేదు. ప్రభుత్వంలో ఉన్నవారికి ముందు చూపులేకపోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడమే ఈ దుస్థితి కి కారణమని విమర్శకులంటున్నారు.


andhra pradesh govenment total debt కోసం చిత్ర ఫలితం


ఈవెంట్ల పేరుతో విచ్చలవిడిగా ఖర్చులు చేయడం, ఆస్తులను సమకూర్చుకోకుండా దుబారా వ్యయాలు చేయడం వల్లే అప్పులు భారీగా పెరుగుతున్నాయని విమర్శకు లు పేర్కొంటున్నారు. అప్పు చేసి పప్పు కూడు సినిమాలో మాదిరిగా చిన్న అప్పు తీర్చటానికి పెద్ద అప్పు, అది తీర్చటానికి మరో భారీ అప్పు చేసుకుంటూ పోతే విజయ్‌ మాల్యా,  టీడీపీ ఎంపీల్లో కొందరు బ్యాంకుల్ని ముంచినట్టే,  చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక  వ్యవస్థనే ముంచి వేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా ఆర్థిక నిపుణుడొకరు వ్యాఖ్యానించారు.  

andhra pradesh govenment total debt కోసం చిత్ర ఫలితం 

టీడీపీ సర్కారు వీలున్న చోటల్లా చేయి చాచి రాష్ట్రాన్ని పరాధీనం లోకి గెంటేయటంతో ఆస్తులు, అప్పుల నిష్పత్తి మారి పోయింది. అప్పులు పెరిగిపోతుండగా ఆస్తులు తరిగిపోతున్నాయి. తదుపరి ప్రభుత్వాలకు అప్పు పుట్టనీయ కుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు సర్కారు ఋణాలు ఊబి లోకి నెట్టివేస్తోంది. అప్పులను హంగూ ఆర్భాటాలకే వెచ్చించడంతో అప్పుల శాతం పెరిగిపోయి ఆస్తులు కరిగిపోతున్నాయి.


andhra pradesh govenment total debt కోసం చిత్ర ఫలితం


అప్పులతో శాశ్వత రాజధాని గానీ, శాశ్వత సాగునీటి ప్రాజెక్టులను గానీ చేపట్టలేదు. కమీషన్ల కోసం తాత్కాలికంగా పట్టిసీమను రూ. 1,600 కోట్లతో చేపట్టగా అందులో 353 కోట్ల రూపాయలు కమీషన్లు చేతులు మారినట్లు “కాగ్‌ నివేదిక” స్పష్టం చేసింది. కాంట్రాక్టర్‌కు ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లు నివేదికలో కాగ్‌ పేర్కొంది.


గత మూడున్నరేళ్లలో సెప్టెంబర్‌ వరకు సాగునీటి రంగానికి 35,819 కోట్ల రూపాయలను వ్యయం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఇందులో సాగునీటి పనులకు వ్యయం చేసింది తక్కువ కాగా జీవో 22 ప్రకారం పాత పనులకు ఎస్క లేషన్‌ పేరుతో భారీగా కాంట్రాక్టర్లకు చెల్లించేసి కమీషన్లను కాజేసింది ఎక్కువగా ఉంది. నీరు–చెట్టు పేరుతో గత మూడు న్నరేళ్లలో నామినేషన్లపై 9,906.88 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. ఇందులో 90 శాతం నిధులు టీడీపీ నేతలు, కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిపోయాయి.

CAG & AP కోసం చిత్ర ఫలితం

ఎక్కడా ఆస్తుల కల్పన అనేది జరగలేదు. తాత్కాలిక రాజధాని పేరుతో 1,000 కోట్ల రూపాయలను వెచ్చించడమే తప్ప శాశ్వత రాజధాని కోసం ఇప్పటి వరకు చేసింది శంకుస్థాపనల పేరుతో ఆర్భాటమే. తాత్కాలిక పనులకు వందల కోట్ల రూపాయలను వెచ్చించడమే తప్ప శాశ్వతనిర్మాణాలకు పైసావెచ్చించలేదు. మరో పక్క పేదలకు పక్కా గహాల నిర్మాణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను వెచ్చించకుండా లబ్ధిదారుల ఎంపిక పేరుతో కాలం వెళ్ళబుచ్చు తోంది.  

CAG & AP కోసం చిత్ర ఫలితం 

CAG slams AP over Pattiseema

రోజూ ఆర్బీఐ నుంచి చేబదుళ్లతోనే సర్దటంతో రాష్ట్ర ఆర్థిక పరపతి పడిపోతోంది. భవిష్యత్‌లో అప్పులు పుట్టడంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్ర పరపతి పడి పోవడంతో గత నెలలో 800 కోట్ల రూపాయల అప్పునకు వెళ్లగా వడ్డీ ఎక్కువగా ఉండ టంతో అప్పు తీసుకోవడానికి ఆర్థిక శాఖ వెనుకాడింది. ఆర్బీఐ ప్రతి రాష్ట్రానికి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించు కోవడానికి “వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యం” కల్పిస్తుంది. ఇది ఒక రకంగా చేబదులు. ఇలా తీసుకున్న సొమ్మును 14 పనిదినాల్లో తిరిగి చెల్లించేయాలి. లేదంటే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అయితే 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్స రం వరకు రాష్ట్ర ప్రభుత్వం చేబదుళ్లకు వడ్డీ కూడా చెల్లించే పరిస్థితిని తీసుకు వచ్చింది. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజార్చిందో అర్ధం చేసుకోవచ్చు.  
FRBM & Andhra Pradesh కోసం చిత్ర ఫలితం 

చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేబదుళ్లను సకాలంలో తీర్చనందుకు  ఏకంగా 100 కోట్ల రూపాయలను వడ్డీ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం మార్కెట్‌ రుణాల కింద 16,100 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇందులో క్యాపిటల్‌ వ్యయం కింద కేవలం రూ. 9,955 కోట్ల నే ఖర్చు చేశారు. మిగతా నిధులన్నీ రెవెన్యూ లోటు కింద వ్యయం చేశారు. 
 

చంద్రబాబు సీఎం కాకముందు 1995కు ముందుగానీ, 2004లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోగానే ఇతర ప్రభుత్వాల హయాం లోగానీ ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు లేదు. 2014 నుంచి ఇప్పటివరకూ మళ్లీ రెవెన్యూ లోటు ఏర్పడింది. 1956 – 1994 తరువాత రెవెన్యూ మిగులు సుమారుగా రూ. 200 కోట్లు ఉంది.

FRBM & Andhra Pradesh కోసం చిత్ర ఫలితం


ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా ఎన్నో భారీ ప్రాజెక్టులు నిర్మించటం సాధ్యమైంది. అదే 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు సీఎంగా ఉండ గా రూ.50000 కోట్లు అప్పు చేస్తే అందులో రూ.22,000 కోట్లు రెవెన్యూ లోటు పూడ్చటానికే సరిపోయింది. అంటే చేసిన అప్పుల్లో రూ. 28,000 కోట్లు మాత్రమే ఆస్తుల కల్పన కోసం క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌గా మిగిలింది.

nitin gadkari & polavaram కోసం చిత్ర ఫలితం

2004లో చంద్రబాబు దిగిపోయి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత, ఆయన మరణించాక మరో ఇద్దరు సీఎంలు మారిన తరువాత కూడా పదేళ్ల కాలంలో రూ. 11,000 కోట్లు రెవెన్యూ మిగులు ఉంది. అంటే తెచ్చిన అప్పులు, రెవెన్యూ మిగులు కలిపి ఆస్తుల కల్పనకు ఉపకరించాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. గతంలో ఆయన హయాంలో రూ. 22,000 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడితే ఈసారి భారీగా, కనీవినీ ఎరగనంతగా 2014 ఏప్రిల్‌ నుంచి 2017 సెప్టెంబరు దాకా మూడున్నరేళ్లకు ఏకంగా రూ. 73,135 కోట్లు రెవెన్యూ లోటు తలెత్తింది. తెచ్చిన అప్పుల్లో 69 శాతం రెవెన్యూ లోటు భర్తీకే సరిపోయింది. ఇది ఎలా జరిగిందో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి “కాగ్‌ గణాంకాల పట్టిక”ను పరిశీలిస్తే అవగతమవుతుంది. 

andhra pradesh govenment total debt కోసం చిత్ర ఫలితం

1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2014లో విడిపోయే వరకు 58 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ. 96,000 కోట్లు. 58 ఏళ్లకూ కలిపి రెవెన్యూ లోటు సుమారు గా రూ. 12,000 కోట్లు ఉంది. ఈ లోటుకు కూడా ప్రధాన కారణం 1995–2004 మధ్య చంద్రబాబు పరిపాలనే. ఆయన హయాంలో ఏర్పడిన రెవెన్యూ లోటు, తరవాత పదేళ్ల లో వచ్చిన రెవెన్యూ మిగులు, అంతకు ముందు రెవెన్యూ మిగులు అంతా కలిపితే రాష్ట్రం విడిపోవటానికి ముందు నికరంగా రూ. 12,000 కోట్ల రెవెన్యూ లోటు కనిపిస్తోంది. 
 

పరిమితులను పట్టించుకోకుండా స్తోమతకు మించి టీడీపీ సర్కారు చేస్తున్న అప్పుల వల్ల భవిష్యత్తులో ఏర్పడే ప్రభుత్వాలు కేవలం వడ్డీలు, పాత బకాయిలు తీర్చుకుంటూ “క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌” గా ఖర్చు చేసేందుకు పైసా కూడా దొరకని దుస్థితి ఇప్పటికే కనిపిస్తోంది.  “ఎఫ్‌ ఆర్‌ బీ ఎం” చట్టాన్ని పట్టించుకోకుండా అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నేరుగా కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీ ఆధారంగా అప్పు చేసి అది కూడా దుర్వినియోగం చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు కనిపిస్తోంది.

సంబంధిత చిత్రం

జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుపై రూ. 3,000 కోట్ల అప్పు చేయడానికి గతంలో కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల జరిగిన కేబినెట్‌ ఆ పరిమితిని ఎత్తివేస్తూ మరో నిర్ణయం తీసుకుంది. జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుపై ఏకంగా రూ. 30,000 కోట్ల అప్పు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మరోపక్క రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుపై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయాలని, ఆ నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించి వచ్చే ఎన్నికల నాటికి కమీషన్లను దండుకోవాలని రాష్ట్ర సర్కారు పెద్దల నిర్ణయంగా ఉందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.  

FRBM & Andhra Pradesh కోసం చిత్ర ఫలితం

విపక్షమే కాకుండా అనేకమంది విఙ్జులు ప్రభుత్వం వివిధ పార్టీలనుండి శాసనసభ్యులను కొనటానికి ఋణాలు గా తెచ్చిన సొమ్ములను దారిమళ్ళించి "పొలిటికల్ మానేజ్మెంట్-పోల్ మానేజ్మెంట్-ఎలెక్షణ్ మానేజ్మెంట్" అనే కుహనా చాణక్య సూత్రా లను భారత రాజకీయాలకు పరిచయం చేసింది తెలుగుదేశం అధినాయకత్వం. వీటిని వారం వారం కామెంట్ లంటూ మద్దతు తెలుపుతూ ప్రజల్లో ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్ళే వార్తా ప్రసారం చేసేలాగా చూసే "మీడియా మానేజ్మెంట్" ట్రాన్స్ నుండి బయటపడే లోగా కొత్త సమస్యలను వెలుగులోకి తెచ్చే అదే మీడియా. రాష్ట్ర ప్రజానీకం  ప్రభుత్వ దర్శకత్వం లో వచ్చే వార్తల పట్ల చాలా మెలుకువగా ఉండాలి.

FRBM & Andhra Pradesh కోసం చిత్ర ఫలితం

ఇన్ని మానేజ్మెంట్లతో ప్రజలను మభ్యపెట్టటంతో అవసరమైనప్పుడు ప్రజాసహకారం, మద్దతు, నమ్మకం, విశ్వాసం ప్రభుత్వం కోల్పోతుందన్నది ఇప్పుడు కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. బహుశా తెలుగుదేశాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు పట్టిన దుర్ఘతి ఇది. పాపం వారికి "సరైన ప్రత్యామ్నాయం" (ఆల్టర్నేటివ్) కూడా లేదు. దాన్ని మించి మోడీ ప్రభంజనం తోడవటం దానికి పవన్ కళ్యాణ్ తోడవటం మాత్రమే ప్రధానకారణం. కేంద్రంలోని నరెంద్ర మోడీ రాష్ట్రానికి సహకారం అందించక పోవటానికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పక పోవటం. అదే పోలవరం విషయంలో కూడా ప్రతిబింబించిందని ఆర్ధిక నిపుణులు అంటు న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: