స్వలింగ సంపర్కులు..మరో మాటలో చెప్పాలంటే గే.. ఈ పదాలు మనం తరచూ విదేశాల గురించి వింటుంటాం.. గేలు పెళ్లిళ్లు చేసుకుంటారని.. వారూ కాపురాలు చేస్తారని.. వారి పెళ్లిళ్లకు చట్టబద్దత ఉందని.. ఇలాంటి వార్తలు విని ఆశ్చర్యపోతుంటాం.. ఏంటో ఈ వైపరీత్యం.. అంతా పాశ్చాత్యపోకడలు అని తిట్టుకుంటుంటాం.. కానీ ఇప్పుడు అదే సంస్కృతి మన తెలుగునేలపైనా విచ్చిలవిడిగా పెరిగుతున్నట్టు తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. 

Image result for స్వలింగ సంపర్కులు

ఈ వైపరీత్యం ఎక్కడో కాదు. ఆంధ్రా రాజధాని గడ్డ గుంటూరులో గే సంస్కృతి పెరిగిపోతోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నివేదికలో చాలా షాకింగ్ కోణాలు ఉన్నాయి. ఈ గే కల్చర్ విస్తృతమయ్యేందుకు ఫేస్ బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలు కూడా  కారణమవుతున్నాయట. ఒక్క గుంటూరు నగరంలోనే 18 వరకూ గే వాట్సప్ గ్రూపులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
Image result for స్వలింగ సంపర్కులు
ఉన్నత చదువుల కారణంగా పెళ్లిళ్లకు దూరమవడం.. ఏళ్ల తరబడి హాస్టళ్లలో గడపడం.. బ్లూఫిల్ములు చూడటం వంటి కారణాల వల్ల క్రమంగా కుర్రాళ్లు గే కల్చర్ వైపు అడుగులు వేస్తున్నారట. గుంటూరులో ఉన్న గే వాట్సప్ గ్రూపుల్లో దాదాపు పదివేలమంది వరకూ మెంబర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఈ గే కల్చర్ చాలా వేగంగా పెరిగిపోతోందని అధ్యయనంలో తేలింది. 


ఒకప్పుడు ఈ గే వ్యవహారం గుట్టుగా సాగేదని.. కానీ ఇప్పుడు  దాని గురించి చాలా సింపుల్ గా బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట. ఇలాంటి విచ్చలవిడి తనం కారణంగా కుర్రాళ్లు సుఖవ్యాధుల బారిన పడి పెద్ద ఎత్తున వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారట.  అందుకే ఇటీవల గుంటూరులో చర్మవ్యాధుల నిపుణులను ఆశ్రయించే కుర్రాళ్ల సంఖ్య పెరిగిందట. అలాగే మానసిక వైద్యుల వద్దకు కౌన్సెలింగ్‌ కోసం వస్తున్న ‘గే’ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందట. ఎందుకైనా మంచిది గుంటూరు ప్రాంతంలోని కుర్రాళ్ల తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తపడితే మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: