దేశంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు కీలక ఘట్టానికి చేరింది. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న FCL రిపోర్టును ఫోరెన్సిక్ అధికారులు కోర్టుకు సమర్పించారు. రెండ్రోజుల్లో ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ అధికారులకు కూడా నివేదిక రానుంది. 5 కేసుల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందన్న వార్తలతో టాలీవుడ్ లో ఇంకా ఎవరికి డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది.

 Image result for TOLLYWOOD DRUGS CASE

తెలంగాణలో డ్రగ్స్ కేసు విచారణ మళ్లీ ఊపందుకోనుంది. ఆరు నెలలుగా ఎన్నో అపవాదాలను మూటకట్టుకున్న ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు FCL రిపోర్టుతో నిందితులపై చార్జ్ షీట్ దాఖలు చేయనుంది. కేసులో కీలక నిందితుడు కెల్విన్ తో పాటు మొత్తం 12 మంది వద్ద శాంపిల్స్ సేకరించారు. వీరిలో సినీ రంగానికి చెందిన పూరి జగన్నాధ్, హీరో తరుణ్, సుబ్బారాజు ఉన్నారు. 12 మంది సినిమా ఆర్టిస్టులను విచారించినా.. కొంతమంది శాంపిల్స్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. 5 కేసుల్లో నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ అధికారులు అవి డ్రగ్స్ వాడిన వారివేనని చెబుతున్నారు. అయితే ఆ ఐదుగురు ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

 Image result for TOLLYWOOD DRUGS CASE

డ్రగ్స్ వాడిని వారిలో సినీ ప్రముఖులంటే.. మళ్లీ ప్రకంపనలు ఖాయం. అలాగే కార్పొరేట్ స్కూళ్లు, ఐటీ కంపెనీల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడేవారని సిట్ తేల్చింది. విచారణలో మాత్రం కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇక టాలీవుడ్ విషయంలో హడావుడి చేసినా.. కేసు నిలబడదని ప్రచారం కోసం విచారణ చేశారని ఎక్సైజ్ శాఖ అపవాదు మూటగట్టుకుంది. NDPC యాక్ట్ ప్రకారం డ్రగ్స్ వాడేవాళ్లని బాధితులుగా పరిగణించాలి. అమ్మకాలు జరిపే వాళ్లు నిందితులుగా ఉంటారు. డ్రగ్స్ వాడారని రిపోర్టుల్లో తేలినవారు.. అమ్మకాలు జరిపారా అన్నది సిట్ తేల్చనుంది. డ్రగ్స్ కేసులో నివేదిక కోర్టుకు చేరింది. మరి డ్రగ్స్ రాకెట్ కేసులో ఎలాంటి సంచలనాలు జరగనున్నాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: