డిసెంబర్ 31 తారీఖు మద్యం సేవించి వాహనం నడుపుతూ  డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు యాంకర్ ప్రదీప్ అర్థరాత్రి అడ్డంగా బుక్కయిన విషయం తెలిసిందే. అయితే అప్పట్నుంచి కొద్దిరోజుల పాటు తన వ్యక్తిగత పనులపై కౌన్సిలింగ్‌కు హాజరుకాలేకపోయాడు.  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పీకలదాకా మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తూ తెలుగు ప్రముఖ యాంకర్ ప్రదీప్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. మోతాదుకు మించి ఏకంగా 178 పాయింట్లు నమోదైన విషయం తెలిసిందే.  దీంతో ప్రదీప్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు కారును సీజ్ చేసి మరో కారులో ఇంటికి పంపారు.
Image result for యాంకర్ ప్రదీప్
అనంతరం కొద్దిరోజుల పాటు పరారీలో ఉన్నట్టు పుకార్లు రావడంతో తన ఫేస్‌బుక్‌‌లో నిమిషం నిడివిగల వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం (08/01/2017)నాడు నగరంలోని గోశామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌కు తన తండ్రితో పాటు ప్రదీప్ చేరుకున్నాడు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ కౌన్సిలింగ్‌లో ప్రదీప్ పాల్గొన్నాడు.
Image result for anchor pradeep drunk and drive
ప్రదీప్‌తో పాటు సుమారు 50 మంది కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు.  అయితే కౌన్సిలింగ్ అనంతరం ప్రదీప్‌ను కోర్టుకు హాజరుపరచాల్సి ఉంది. అనంతరం ఏం పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది అంతుచిక్కని విషయంగా మారింది. ట్విస్ట్ ఏంటేంటే..టీవీ యాంకర్ ప్రదీప్ బుధవారం కోర్టుకు హాజరయ్యే విషయంపై సందిగ్ధం ఏర్పడింది.
Image result for anchor pradeep drunk and drive
కోర్టుకు హాజరుకావాలని ప్రదీప్‌కు ట్రాఫిక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. నేను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని ప్రదీప్ తెలపడంతో ఆయన కోర్టుకు హాజరవుతారా.. లేదా... అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: