సుదీర్ఘ కాలం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తుండడం, మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత ఊపందుకుంటూ ఉండడంతో ఈసారి టీడీపీ వినతులను మోదీ పరిగణనలోకి తీసుకుంటారని అందరూ భావించారు. అయితే మోదీ వైఖరిలో ఏమాత్రం వచ్చినట్టు కనిపించడం లేదు.

Image result for modi chandrababu

          ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో ఆశలతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. మోదీ తనంతట తాను చంద్రబాబుతో భేటీ అవుతున్నట్టు వారం రోజుల క్రితం ప్రకటించారు. ఏడాదిగా అపాయింట్ మెంట్ ఇవ్వని మోదీ.. స్వయంగా అపాయింట్ మెంట్ ఇచ్చి బాబును ఢిల్లీకి పిలిపించుకున్నారు. దీంతో ఈసారి రాష్ట్రానికి అంతోఇంతో న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే అలాంటిదేం కనిపించడం లేదు. సుమారు గంటపాటు మోదీతో భేటీ అయిన చంద్రబాబు యధావిధిగా తన కోరికల చిట్టాను ప్రధాని ముందుంచారు. అయితే వాటిని సావధానంగా విన్న మోదీ.. దేనిపైనా నిర్దిష్ట హామీ ఇవ్వలేదని సమాచారం.

Image result for modi chandrababu

          విభజనచట్టంలోని హామీలన్నింటినీ పరిష్కరించాలని చంద్రబాబు మోదీని కోరారు. అడ్డగోలుగా చేసిన విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, ఆ మేరకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదంటే ప్రత్యేక ప్యాకేజీకి కూడా ఓకే చెప్పామని.. అయితే ఆ మేరకు కూడా నిధులు రాలేదని మోదీకి గుర్తు చేశారు. ప్యాకేజ్ లే పేర్కొన్న విధంగా వెంటనే బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. హౌసింగ్, నాబార్డ్, హడ్కో ద్వారా ఏపీకి నిధులు విడుదల చేయాలని సూచించారు.

Image result for modi chandrababu

ప్రధాని భేటీలో పోలవరంపై ప్రత్యేకంగా చర్చించారు. ఇప్పటివరకూ 12 వేల కోట్లు ఖర్చు చేశామని 53శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం 7780 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 4300 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. మిగిలినవాటిని కూడా ఇవ్వాలని కోరారు. అలాగే.. విభజనచట్టంలో పేర్కొన్న విశాఖ రైల్వే జోన్ కూడా అలాగే పెండింగ్ లో ఉన్న విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఇస్తామన్న వెయ్యి కోట్లను వెంటనే ఇవ్వాలని కోరారు. 13వ షెడ్యూల్ లో 11 ఇనిస్టిట్యూషన్స్ ఇస్తామని చెప్పి 9 మాత్రమే ఇచ్చారన్నారు. ఇంకా రెండు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. పైగా వీటన్నింటికీ కేవలం 4వందల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.

Image result for andhra pradesh

కడపలో స్టీల్ ప్లాంట్, వైజాగ్, విజయవాడ మెట్రో, విశాఖ - చెన్నై కారిడార్, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, ఏపీ విభజన చట్టం అమలు.. తదితర అంశాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రధానిని కోరారు. వీటన్నింటికీ సరేనని తలూపిన మోదీ.. ఏపీ అంశాలకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని మాత్రం మాటిచ్చారు. మరి అది కూడా ప్రత్యేక హోదా లాంటి హామీనా.. లేక నిజంగా ర్పాటు చేస్తారా అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: