చిత్తూరు జిల్లా పోలీసులకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. సెక్యూరిటీ పరంగా అత్యంత సున్నితమైన సమస్యను వారు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే కీలక వ్యక్తులిద్దరూ ఒకే నియోజక వర్గంలో ఉండటమే ఇందుకు కారణం. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో 63వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అది చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఆయన ఇదే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. 

chandrababu jagan కోసం చిత్ర ఫలితం

మరోవైపు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లె ఈ నియోజకవర్గంలోనే ఉంది. సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి సొంత ఊరు చేరుకున్నారు. అందులోనూ ఆయన వియ్యంకుడు బాలకృష్ణ కుటుంబం కూడా నారావారిపల్లెకు తరలివచ్చింది. సీఎం చంద్రాబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఇలా ఒక విధంగా ఇప్పుడు నారావారిపల్లె వీఐపీలతో సందడిగా మారింది.

chandrababu jagan కోసం చిత్ర ఫలితం

 రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఒకే నియోజకవర్గంలో ఉండటంతో ఇరుపార్టీల కార్యకర్తలతో నియోజకవర్గమంతా సందడి వాతావరణం నెలకొంది. జగన్ పాదయాత్ర పాత కందులవారి పల్లి వద్ద మొదలైన పాదయాత్ర నెన్నూరు, శెట్టివారి పల్లి క్రాస్ రోడ్స్, కట్టకింద వెంకటాపురం, వెంకటాపురం క్రాస్ రోడ్స్, చల్లావారిపల్లె, రావిళ్లవారి పల్లె మీదుగా పారకాల్వ క్రాస్ రోడ్స్ వరకు కొనసాగింది. నెన్నూరులో  వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, వైసీపీ పతాకాన్ని ఎగురవేశారు.

సంబంధిత చిత్రం

సంక్రాంతి రోజు జగన్ పారకాల్వ గ్రామంలో ఆయన తండ్రికి పూజలు నిర్వహించనున్నారు. అటు జగన్... ఇటు సీఎం చంద్రబాబు కుటుంబం ఒకే నియోజకవర్గంలో ఉండటంతో వారికి భద్రత కల్పించాల్సిన చిత్తూరు పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. ఎక్కడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇరు పార్టీల నాయకుల మధ్య గొడవలు రాకుండా చూడటంతో పాటు వారికి పూర్తి స్థాయి భద్రత కల్పించాల్సిన బాధ్యత వారిపై పడింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: