తమిళనాడు వ్యాప్తంగా పొంగల్ సంబరాలు అంబరాన్నంటాయి. పొంగల్ సందర్భంగా సంప్రదాయబద్దమైన జల్లికట్టు నిర్వహిస్తున్నారు. జల్లికట్టు పోటీలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. పాలమేడులో నిర్వహించిన జల్లికట్టు పోటీలను వేలాది మంది తిలకరించారు. గతేడాది జల్లికట్టుకు సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో తమిళజాతి అంతా ఏకమై ఉద్యమించింది. చెన్నై మెరీనా బీచ్‌లో చేసిన పోరాటానికి అన్నాడీఎంకే ప్రభుత్వం దిగొచ్చింది. ఆఘమేఘాల మీద సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు అనుమతి ఇస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది.దీంతో ఆటంకాలన్నీ తొలగిపోయాయి. 

తమిళనాడులో పొంగల్ దంగల్ జరుగుతోందిప్పుడు. మధురైతో పాటు పలు ప్రాంతాల్లో జల్లికట్టు జరుగుతోంది. మూడో రోజు జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం పోటీలను ప్రారంభించారు. ఉదయమే పోటీలో పాల్గొనే ఎద్దులకు ప్రత్యేక పూజలు చేశారు.
Jallikattu event underway in Madurai's Alanganallur - Sakshi
ఇటు వాటి కొమ్ములు పట్టుకుని అణిచివేసేందుకు యువకులు సిద్ధమయ్యారు. తమిళనాట జల్లికట్టుకు వందలయేళ్ల చరిత్ర ఉంది. సంప్రదాయ క్రీడగా విరాజిల్లుతున్న జల్లికట్టులో హింస జరుగుతోంది. కొమ్ములతో కుమ్మేస్తూ కాళ్ల కింద వేసి తొక్కుతూ ఎద్దులు పోతూ ఉంటే ఔత్సాహికులు గాయాలపాలవుతారు. కొన్నేళ్లుగా చాలామంది చనిపోయారు కూడా.
Image result for jallikattu
అటు ఎద్దుల తోకలను కొరికి, ఒకేసారి పదిమంది పడి కొమ్ములు విరిచేసరికి ఎద్దు కూడా విలవిలలాడిపోయేది. పోటీలను చూడటానికి వచ్చిన 19 ఏళ్ల యువకుడిని ఎద్దు కొమ్ములతో పొడవగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఎద్దులు మీదికి దూసుకురావడంతో జరిగిన తొక్కిసలాటలో అటు జల్లికట్టులో పాల్గొన్న యువకులతో పాటు, చూసేందుకు వచ్చిన 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: