చంద్ర బాబు నాయుడు ఎప్పుడు అన్ని మీటింగ్ లో ఒకే మాట చెబుతుంటాడు. కేద్రం సహాయం చేయడం లేదని, రాష్ట్రానికి అన్యాయం చేసిందని, అయితే ఇక్కడ అందరికి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంటుంది. కేంద్రం అన్యాయం చేస్తే చూస్తూ ఎందుకు గమ్మున ఉన్నాడని, ఇప్పుడేమో కోర్ట్ కు వెళతా అంటున్నాడు.  చంద్రబాబునాయుడు మోడీ తో గడిపింది కేవలం కొన్ని నిమిషాల వ్యవధి మాత్రమే.. కానీ బయటకు వచ్చి తాను  ప్రెస్ మీట్ పెట్టి.. సుదీర్ఘంగా గంటల తరబడి ఉపన్యసించారు.
Image result for chandrababu naidu and narendra modi
చూడబోతే చెప్పవలసిన చోట  చెప్పింది తక్కువ..  రెండు ముక్కల్లో ముగించాల్సిన చోట అంటే బయట  చెప్పింది ఎక్కువగా కనిపిస్తోంది. చూడబోతే.. తాను మోడీకి సమర్పించిన మొత్తం 17పేజీల పాఠాన్ని బయట మీడియాకు అప్పజెప్పి.. అదంతా మోడీ చెప్పినంతగా ఫీలయి భారం దించేసుకున్నారు. ఇంతా కలిపి 'సీరియస్ గా పరిశీలించి న్యాయం చేస్తా' అన్నారు ఇదొక్కటే మోడీ రెస్పాన్స్ గురించి చంద్రబాబు చెప్పిన వాక్యం. ఒక్క ముక్కలో చెప్పలాంటే.. ఈ చంద్రభేటీ అనేది.. నరేంద్రమోడీ రెండేళ్ల కిందట  అమరావతి శంకుస్థాపనకు వచ్చి.. మట్టీ నీళ్లూ మన మొహాన కొట్టి చేసిన అవమానం కంటె ఇది దొడ్డది. కానీ ఇక్కడ  గమనించాల్సిన ఇంకో విషయం ఉంది.

Image result for chandrababu naidu and narendra modi

చంద్రబాబు తన ప్రెస్ మీట్ లో ఓ మాటను చాలా  యథాలాపంగా పాసింగ్ స్టేట్మెంట్ లాగా అనేశారు. ఇప్పటికీ న్యాయం చేయకపోతే.. ఇక కోర్టును ఆశ్రయించడం తప్ప మాకు మార్గం లేదు అని ఆయన చెప్పారు. కోర్టులో ఎలా న్యాయాన్ని పొందాలో ఇప్పటినుంచి నిపుణలతో మాట్లాడి చంద్రబాబు సిద్ధపడితే మంచిది. అలాగే.. ఎప్పటిదాకా కేంద్రం చేసే న్యాయం కోసం ఎదురుచూసి.. ఏ డెడ్ లైన్ తర్వాత కోర్టుకు వెళ్తారో కూడా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: