మనదేశంలో కుల వ్యవస్థ ఎంత బలమైందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఇలాంటి దరిద్రమైన కుల వ్యవస్థ మన దేశానికే ప్రత్యేకమైన అంశం. కానీ దేశం విడిచిపోయినా ఈ దరిద్రం మాత్రం మనల్ని విడిచిపోవడంలేదు. చివరకు మన వాళ్లు విదేశాల్లో స్థిరపడినా అక్కడ కూడా కులపిచ్చితోనే కొట్టకుంటున్నారన్న విషయాన్ని ప్రముఖ టీవీ ఛానల్ టీవీ9 మరోసారి రుజువు చేసింది. ఇటీవల ఆ ఛానల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో అనేక ఆసక్తికరమైన డిస్కషన్ జరిగింది.  

caste system కోసం చిత్ర ఫలితం

ఇటీవల ఒక సామాజివర్గం వర్గం వారు తమ కులాన్ని కీర్తిస్తూ… తొడ కొట్టాలన్నా, మీసం తిప్పాలన్నా, రాజకీయాల్లో రాణించాలన్నా, చిత్రసీమను ఏలాలన్నా, ఆటల్లో పతకాలు సాధించాలన్నా తమ వారి వల్లే సాధ్యమంటూ ఒక క్యాస్ట్ యాంథమ్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్‌, ఎన్జీ రంగా, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, రామోజీరావు, తానా అధ్యక్షుడు సతీష్ వేమన, సత్యనాదెండ్ల, హీరో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌, కృష్ణ, కోనేరు హంపి, అశ్వనీదత్‌, మోహన్‌ బాబు, పరిటాల రవి, దర్శకుడు రాఘవేంద్రరావు తదితరులను కీర్తిస్తూ ఈ పాట తయారు చేశారు. టీవీ9 తాజాగా సదరు సామాజికవర్గం యాంథమ్‌పై చర్చ నిర్వహించింది.

caste system కోసం చిత్ర ఫలితం
చర్చలో... పాటను తయారు చేసిన సందీప్ చౌదరి ఫోన్‌ లైన్‌లోకి వచ్చారు. పాట తయారు చేయడంలో తప్పులేదని సందీప్‌ చౌదరి సమర్దించుకున్నారు.  పాటను అందరూ పాజిటివ్‌ యాంగిల్‌లో చూడాలని కోరారు. ఇందుకు గోగినేని బాబు తీవ్రంగా స్పందించారు. పీవీ సింధుకు మెడల్ వచ్చినప్పుడు కూడా ఈ కులం వాళ్లు ఆమె తమ కులస్తురాలేనని ప్రచారం చేసుకున్నారని.. కానీ నిజం తెలిశాక నాలుక కరుచుకున్నారని చెప్పారు. సత్య నాదెండ్ల అనే వ్యక్తి బ్రహ్మణ సామాజికవర్గానికి చెందిన వారని.. కానీ ఆయన్ను కూడా ఈ కుల పాటలో చేర్చడం ద్వారా వారికి ఏ స్థాయిలో అవగాహన ఉందో చాటుకున్నారని విమర్శించారు. 

kamma caste కోసం చిత్ర ఫలితం
ఇలాంటి మూర్ఖులను వెంటనే అమెరికా నుంచి వెనక్కు పంపించాలి అని బాబు గోగినేని తీవ్రంగా మండిపడ్డారు. పాటను తయారు చేసిన వారు గానీ… తమ రక్తం ప్రత్యేకమైనది అని చెబుతున్న ఆ కుల ఐకాన్లు గానీ ఎవరొచ్చినా సరే డీఎన్‌ఏ పరీక్షలు తేల్చి వారేమీ మిగిలిన వారికి అతీతులు కారన్నది తేల్చేందుకు తాను సిద్దమని సవాల్ చేశారు. చికాగోలో ఉంటూ కూడా కులాన్ని పాజిటివ్‌గా చూడాలని సందీప్‌ చౌదరి చెబుతున్నారని.. ఇది కూడా కులరోగమేనని గోగినేని ఫైర్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: