ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యం తీవ్రం అవుతున్న సంగతి తెలిసిందే.  అయితే దీనికి ముఖ్యకారణంగా వాహనాలు నడిపే వారు ఎక్కువ శాతం మద్యం మత్తులో ఉండటమే అని డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు తెలుపుతున్నారు.  కొన్ని సార్లు నిద్రలేమి వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఏది ఏమైనా ఎంతో మంది ఈ ప్రమాదాల వల్ల రోడ్డున పడుతున్నారు..అనాథలుగా మిగిలిపోతున్నారు.  మరోవైపు పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ప్రమాదాలను మాత్రం అరికట్టలేక పోతున్నారు.  గత కొంత కాలంగా తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవర్ నిర్వహిస్తూ ఎంతో మంది వాహనదారులను పట్టుకుంటున్నారు. 
Image result for womens drinking and drive hyderabad
ఇక హైదరాబాద్ మహానగరంగా విస్తరిస్తున్న తరుణంలో నేరాలు ఘోరాలు బాగానే పెరిగిపోతున్నాయి.  ఇక యువతీ, యువకులు  మందేసి చిందేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారు.  ఇందులో సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతున్నారు.  ఎన్ని హెచ్చరికలు చేసినా, శిక్షలు పడుతున్నా యువతీ యువకులు మాత్రం తీరు మార్చుకోవట్లేదు.
Image result for womens drinking and drive hyderabad
అంతే కాదు హైదరాబాద్ పబ్బుల్లో పుల్లుగా మందేసి కార్లునడుపి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు.తాజాగా.. శనివారం రాత్రి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 75 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 38 కార్లు, 37 బైక్‌లను సీజ్ చేశారు. పట్టుబడ్డ వారిలో ఇద్దరు యువతులు ఉన్నారు.
Image result for hyderabad pub culture
పోలీసులకు సహకరించకుండా యువతులు హంగామా సృష్టించారు. అతి కష్టం మీద పోలీసులు చేసిన  టెస్టుల్లో మోతాదుకు మించి మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. మద్యం సేవించే విషయంలోనూ మీకంటే ఒక మెట్టుపైనే ఉన్నామని అక్షరాలా నిరూపించుకుంటున్నారు.! ఈ విషయం హైదరాబాద్‌లో ప్రతీవారం పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌‌లో పట్టుబడుతున్న యువతులు, మహిళలను చూస్తే మీకే అర్థమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: