చిన్న వయసులో సేవాభావాన్ని అలవరచుకుని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకోసం కృషిచేస్తోన్న పద్నాలుగేళ్ల  విద్యార్థిని అంబుల వైష్ణవిని నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతికి అంబాసిడర్‌ గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియేట్ లో తనను కలిసిన వైష్ణవిని అభినందించిన ఆయన, ఇటువంటి బాలికలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.  కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన 14 ఏళ్ల అంబుల వైష్ణవి ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. అమరావతి నిర్మాణానికి సైతం వైష్ణవి తన వంతు సాయం అందించింది.
amaravati 30012018
రాజధాని కోసం రూ.లక్ష విరాళం అందజేసింది. ఇప్పటివరకూ తాను రూ. 4 లక్షలు ఖర్చుచేసి రెండు పాఠశాలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వైష్ణవి వెల్లడించింది. అమరావతి అంబాసిడర్‌గా వైష్ణవిని నియమిస్తున్నట్లు వెల్లడించిన చంద్రబాబు, ఆ బాలికకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ‘రాజధాని నిర్మాణం కోసం రూ.లక్ష విరాళంగా ఇచ్చిన తొమ్మిదో తరగతి బాలిక వైష్ణవిని చూస్తుంటే గర్వంగా ఉంది.
Image result for amaravathi
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిన్నతనంలోనే సమాజ సేవ చేయాలని, దేశాభ్యుదయానికి పాటు పడాలని విద్యార్థులు భావించాలని.. అందరూ వైష్ణవిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలిపారు. లక్షలు ఖర్చు పెట్టి ఆ చిన్నారి చేస్తున్న అభివృద్ధి పనులు అందరికీ స్ఫూర్తినివ్వాలని ముఖ్యమంత్రి అన్నారు.

ఎవరి స్థోమతకు తగ్గట్టు రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తున్నారు... 10 రూపాయలు విరాళంగా ఇచ్చిన పేదవారు కూడా ఉన్నారు... ఇలాంటి వారిని చూసైనా, అమరావతి మీద పడి ఏడ్చే వారు, బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం అని ఆయన అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: